మార్కెట్ బెంచ్‌మార్క్ బీఎస్ఈ సెన్సెక్స్ ప్రారంభ ట్రేడింగ్‌లో 100 పాయింట్లకు పైగా పెరిగింది. అనంతరం.. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో నష్టాల్లోకి జారుకున్నాయి సూచీలు.
తొలుత అంతర్జాతీయంగా సానుకూల పవనాలు, విదేశీ నిధుల ప్రవాహం నేపథ్యంలో ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ ట్విన్స్, ఐసీటీ లాభాలను మూటగట్టుకున్నాయి.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 91 పాయింట్లు కోల్పోయి 40 వేల 37 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 19 పాయింట్ల నష్టంతో 11 వేల 858 వద్ద ట్రేడవుతోంది.
లాభనష్టాలు
ఇండస్ఇండ్ బ్యాంకు, హీరో మోటోకార్ప్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఐటీసీ, ఇన్ఫోసిస్ (2.68 శాతం మేర) రాణిస్తున్నాయి. భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్, ఎస్ బ్యాంకు, టీసీఎస్, ఆర్ఐఎల్, ఎస్బీఐ (1.98 శాతం మేర) నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు
అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై ఆశలతో షాంఘై, హాంకాంగ్, సియోల్ లాభాల్లో కొనసాగుతుండగా, టోక్యో మార్కెట్ నష్టాల్లో ట్రేడవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దిగువ సభలో అభిశంసన తీర్మానం నెగ్గిన నేపథ్యంలో వాల్‌స్ట్రీట్ మిశ్రమ ఫలితాలు నమోదు చేసింది.
రూపాయి
ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి విలువ 4 పైసలు తగ్గి, ఒక డాలరుకు రూ.70.96గా ఉంది.
ముడిచమురు
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 0.07 శాతం పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 59.66 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి: 'పెప్సికో ఇండియా'కు కార్పొరేట్ ఎక్సలెన్స్ అవార్డు