దేశీయ స్టాక్మార్కెట్లో 7 రోజుల పాటు వరుస లాభాలకు నిన్నటితో అడ్డుకట్టపడింది. మదుపర్లు ఇప్పటికీ లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్న నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లు ఇవాళా నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా-చైనా వాణిజ్య చర్చలపై ఆశలతో అంతర్జాతీయ విపణులు మాత్రం ఆశాజనకంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నుంచి దిశాత్మక సూచనలు లేనందున మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిందని వ్యాపారులు భావిస్తున్నారు.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 154 పాయింట్లు పతనమై 40 వేల 95 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 50 పాయింట్లు కోల్పోయి 11 వేల 867 వద్ద ట్రేడవుతోంది.
లాభనష్టాలు
సన్‌ఫార్మా, ఎస్ బ్యాంకు, కోల్ ఇండియా, వేదాంత, ఇన్ఫోసిస్, సిప్లా, జీ ఎంటర్టైన్మెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ రాణిస్తున్నాయి.
భారతీ ఎయిర్టెల్, హెచ్‌సీఎల్ టెక్, ఐటీసీ, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ ట్విన్స్, టీసీఎస్, రిలయన్స్, మారుతీ సుజుకి, యాక్సిస్ బ్యాంకు, టైటాన్ కంపెనీ, మారుతీ ఇన్ఫ్రాటెల్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు
జపాన్ నిక్కీ, కోస్పీ లాభాల్లో కొనసాగుతుండగా, హాంగ్‌సెంగ్, షాంఘై కాంపోజిట్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు నిన్న వాల్‌స్ట్రీట్ నష్టాలతో ముగిసింది.
రూపాయి విలువ
రూపాయి విలువ 9 పైసలు క్షీణించింది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ ప్రస్తుతం 70.78గా ఉంది.
ముడిచమురు
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 0.64 శాతం క్షీణించింది. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 62.56 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి: ఇన్ఫోసిస్‌లో 10,000 ఉద్యోగాల కోత!