మిడ్ సెషన్లో అమ్మకాల ఒత్తిడి..
స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 350 పాయింట్లకుపైగా కోల్పోయి.. 39,400 దిగువన ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 100 పాయింట్ల నష్టంతో 11,573 వద్ద కొనసాగుతోంది.
టెలికాం, బ్యాంకింగ్ షేర్లలో మిడ్ సెషన్లో అమ్మకాల ఒత్తిడి నష్టాలకు కారణంగా తెలుస్తోంది.
- నెస్లే, టీసీఎస్, సన్‌ఫార్మా, ఎన్టీపీసీ, ఐటీసీ, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో ఉన్నాయి.
- భారతీ ఎయిర్టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, మారుతీ సుజుకీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.