ETV Bharat / business

స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు.. సెన్సెక్స్ 414- - సెన్సెక్స్

stock markets today
నేటి స్టాక్​ మార్కెట్లు
author img

By

Published : Jun 9, 2020, 9:41 AM IST

Updated : Jun 9, 2020, 3:50 PM IST

15:49 June 09

34 వేల దిగువకు సెన్సెక్స్..

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 414 పాయింట్ల క్షీణతతో 33,957 వద్దకు చేరింది. నిఫ్టీ 121 పాయింట్ల నష్టంతో 10,047 వద్ద స్థిరపబడింది.

ఇండస్​ఇండ్​ బ్యాంక్, సన్​ఫార్మ, ఎం&ఎం, హెచ్​డీఎఫ్​సీ, ఏషియన్​ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్​ షేర్లు లాభాలతో ముగిశాయి.    

ఐసీఐసీఐ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్​టెల్, యాక్సిస్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, టైటాన్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

15:02 June 09

సెన్సెక్స్ 420 పాయింట్లు మైనస్​..

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెషన్​ ముగింపునకు ముందు సెన్సెక్స్ ఏకంగా 420 పాయింట్లకుపైగా కోల్పోయి 33,949 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 120 పాయింట్లకుపైగా నష్టంతో 10,045 వద్ద కొనసాగుతోంది.

ఆర్థిక, టెలికాం రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నష్టాలకు ప్రధాన కారణం.

సన్​ఫార్మా, ఇండస్​ఇండ్ బ్యాంక్, ఎం&ఎం, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, హీరో మోటోకార్ప్​లు సానుకూలంగా స్పందిస్తున్నాయి.

బజాజ్​ ఫినాన్స్, భారతీఎయిర్​టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ షేర్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

11:30 June 09

మిడ్​ సెషన్​ ముందు జోరు..

స్టాక్​ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. మిడ్​ సెషన్​ ముందు సెన్సెక్స్ 300 పాయింట్లకుపైగా లాభంతో 34,664 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 90 పాయింట్ల వృద్ధితో 10,255 వద్ద కొనసాగుతోంది.

ఇండస్​ఇండ్ బ్యాంక్ అత్యధిక లాభంతో ట్రేడవుతోంది. సన్​ఫార్మా, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, హెచ్​డీఎఫ్​సీ, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.  

పవర్​ గ్రిడ్​, ఎన్​టీపీసీ, నెస్లే, హెచ్​డీ​ఎఫ్​సీ నష్టాల్లో ఉన్నాయి.

09:58 June 09

లాభనష్టాల మధ్య దోబూచులాట

మంగళవారం సెషన్​లో స్టాక్ మార్కెట్లు లాభనష్టాల మధ్య దోబూచులాడుతున్నాయి. ఆరంభంలో నష్టాలను నమోదు చేసిన సూచీలు.. కొద్దిసేపటికే లాభాల్లోకి వెళ్లాయి.

సెన్సెక్స్ 280 పాయింట్లకుపైగా లాభంతో 34,649 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 64 పాయింట్ల వృద్ధితో 10,231 వద్ద కొనసాగుతోంది.

సన్​ఫార్మా, ఏషియన్​ పెయింట్స్, ఐటీసీ, ఇండస్​ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్ లాభాల్లో ఉన్నాయి.

టైటాన్​, మారుతీ, రిలయన్స్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, కోటక్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా నష్టాల్లో ఉన్నాయి.

09:27 June 09

ఒడుదొడుకుల్లో సూచీలు..

స్టాక్ మార్కెట్లు మంగళవారం ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 70 పాయింట్లకుపైగా కోల్పోయి ..34,298 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ దాదాపు 30 పాయింట్ల నష్టంతో 10,139 వద్ద ట్రేడవుతోంది.

బ్యాంకింగ్, ఆటో రంగాల్లో అమ్మకాల ఒత్తిడి నష్టాలకు కారణంగా తెలుస్తోంది.

Last Updated : Jun 9, 2020, 3:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.