అమ్మేశారు..
వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిశాయి స్టాక్ మార్కెట్లు. ఆరంభం నుంచి సానుకూలంగా స్పందించిన సూచీలు చివరి గంటలో అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
సెన్సెక్స్ 262 పాయింట్లు కోల్పోయి 31,453 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 88 పాయింట్ల నష్టంతో 9,206 వద్దకు చేరింది.
- ఆర్థిక రంగ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.
- ఎం&ఎం, పవర్‌గ్రిడ్, ఓఎన్జీసీ, రిలయన్స్, ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్‌టెక్, నెస్లే ఇండియా షేర్లు లాభపడ్డాయి.
- ఎస్బీఐ, బజాజ్ ఫినాన్స్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.