జోరు తగ్గినా లాభాలే
స్టాక్ మార్కెట్లు బుధవారం సెషన్లో లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 284 పాయింట్లు పుంజుకుని 34,109 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 82 పాయింట్ల వృద్ధితో 10,061 వద్దకు చేరింది. ఆరంభంతో పోలిస్తే చివరకు సూచీల జోరు కాస్త తగ్గింది.
బుధవారం సెషన్తో కలిపి స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగియడం వరుసగా ఆరో రోజు.
బ్యాంకింగ్ రంగ షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఎం&ఎం, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, నెస్లే, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్లు ప్రధానంగా లాభాపడ్డాయి.
ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, మారుతీ, హీరో మోటోకార్ప్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి.