ETV Bharat / business

హెవీ వెయిట్ షేర్ల దన్ను.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు - సెన్సెక్స్

stocks today
నేటి స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Jun 22, 2020, 9:29 AM IST

Updated : Jun 22, 2020, 10:42 AM IST

10:39 June 22

కొనసాగుతున్న లాభాలు..

స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 260 పాయింట్లకుపైగా లాభంతో 34,993 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 70 పాయింట్లకుపైగా వృద్ధితో 10,317 వద్ద ట్రేడవుతోంది.

  • విదేశీ పెట్టుబడుల ప్రవాహంతో హెవీ వెయిట్ షేర్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి. వీటికి తోడు అంతర్జాతీయంగా సానుకూలతలు కొనసాగుతుండటం లాభాలకు ప్రధాన కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.
  • ఆసియాలో ఇతర ప్రధాన స్టాక్ మార్కెట్లు అయిన షాంఘై, టోక్యో, సియోల్ సూచీలు లాభాలతో సెషన్​ను ప్రారంభించాయి. హాంకాంగ్ సూచీ మాత్రం ఒడుదొడుకుల్లో ఉంది.
  • ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ సోమవారం స్వల్పంగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్​లో బ్యారెల్ ముడి చమురు ధర 42.20 డాలర్ల వద్ద ఉంది.
  • బజాజ్ ఫిన్​సర్వ్​, బజాజ్ ఆటో, బజాజ్ ఫినాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్​ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • ఇన్ఫోసిస్, మారుతీ, ఓఎన్​జీసీ, టీసీఎస్​, ఎం&ఎం, అల్ట్రాటెక్ సిమెంట్​ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

08:51 June 22

35 వేల మార్క్ దాటిన సెన్సెక్స్..

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం సానుకూలంగా ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్​ 300 పాయింట్లకుపైగా లాభంతో 35,032 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 80 పాయింట్లకుపైగా వృద్ధితో 10,332 వద్ద కొనసాగుతోంది.

ఆర్థిక, ఫార్మా, విద్యుత్ రంగ షేర్లు లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి.

లాభనష్టాల్లోని షేర్లు..

బజాజ్ ఫిన్​సర్వ్​, బజాజ్​ ఫినాన్స్, ఇండస్​ఇండ్ బ్యాంక్, సన్​ఫార్మా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి. 

టీసీఎస్​, అల్ట్రాటెక్​ సిమెంట్, ఎం&ఎంలు మాత్రమే 30 షేర్ల ఇండెక్స్​లో నష్టాల్లో ఉన్నాయి.

Last Updated : Jun 22, 2020, 10:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.