స్టాక్ మార్కెట్లు వారాంతపు సెషన్‌ను లాభాలతో ప్రారంభించాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 270 పాయింట్లకుపైగా పెరిగి జీవనకాల గరిష్ఠమైన 52,572 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 80 పాయింట్లకుపైగా లాభంతో కొత్త రికార్డు స్థాయి అయిన 15,820 వద్ద కొనసాగుతోంది.
హెవీ వెయిట్, వాహన, బ్యాంకింగ్ షేర్ల సానుకూలతలు లాభాలకు కారణంగా తెలుస్తోంది.
- పవర్‌గ్రిడ్, ఓఎన్జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎం&ఎం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
- బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫినాన్స్, టెక్ మహీంద్రా, టైటాన్, హెచ్‌యూఎల్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.