అంతర్జాతీయ ప్రతికూలతలకు తోడు లాభాల స్వీకరణ మదుపరులు మొగ్గుచూపడం వల్ల... దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఆరంభంలో భారీ నష్టాల్లో ఉన్న సూచీలు.. హెవీ వెయిట్ స్టాక్స్ దన్నుతో కాస్త తేరుకున్నాయి. ఐటీ, లోహ, ఎనర్జీ స్టాక్స్ రాణించగా... బ్యాంకింగ్ షేర్లు డీలాపడ్డాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 194 పాయింట్లు కోల్పోయి 37 వేల 934 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 62 పాయింట్లు నష్టపోయి 11 వేల 131 వద్ద స్థిరపడింది.
లాభనష్టాల్లో
ఏషియన్ పెయింట్స్, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ రాణించాయి.
ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ, టైటాన్, ఐటీసీ నష్టపోయాయి.
ఇదీ చూడండి: జుకర్బర్గను దాటి ముకేశ్ 4వ స్థానానికి చేరేనా?