స్టాక్ మార్కెట్ల వరుస లాభాల జోరుకు బ్రేక్ పడింది. మంగళవారం సెషన్లో బీఎస్ఈ-సెన్సెక్స్ 341 పాయింట్ల నష్టంతో 49,161 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 91 పాయింట్లు కోల్పోయి 14,850 వద్దకు చేరింది.
కరోనా సంక్షోభం, రాష్ట్రాల వారీగా లాక్డౌన్, ఇటీవలి వరుస లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడటం వంటివి నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతలు కూడా ఇందుకు మరో కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు.
ఐటీ, లోహ షేర్లు భారీగా పతనమయ్యాయి. విద్యుత్, ఇంధన, ఫార్మా షేర్లు కాస్త రాణించాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 49,304 పాయింట్ల అత్యధిక స్థాయి, 48,988 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 4,900 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,771 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, పవర్‌గ్రిడ్, సన్‌ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్ లాభాలను గడించాయి.
కోటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ, హెచ్‌యూఎల్, బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు నష్టాలతో ముగిశాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. షాంఘై స్వల్ప లాభాలను గడించింది. నిక్కీ, కోస్పీ, హాంగ్‌సెంగ్ సూచీలు భారీగా నష్టపోయాయి.
ఇదీ చదవండి:ప్లాస్మా దాతల వివరాలు చెప్పే 'సంజీవని'