అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణలతో దేశీయ స్టాక్‌మార్కెట్లు కుదేలయ్యాయి. రికార్డు స్థాయి లాభాల తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడమూ ఇందుకు తోడైంది. ఉదయం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోకపోవడం గమనార్హం.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 504 పాయింట్లు కోల్పోయి 38 వేల 594 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 148 పాయింట్లు నష్టపోయి 11 వేల 440 వద్ద స్థిరపడింది.
లాభాల్లో
పవర్‌గ్రిడ్ కార్ప్, టీసీఎస్, ఎన్టీపీసీ, ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌యూఎల్ రాణించాయి.
నష్టాల్లో
ఎస్బీఐ, టాటా మోటార్స్, మారుతీ సుజూకీ, ఐషర్ మోటార్స్, ఎమ్ అండ్ ఎమ్, ఎస్ బ్యాంకు నష్టాలపాలయ్యాయి.
ఆసియా మార్కెట్లు
నిక్కీ, హాంగ్‌సెంగ్, కోస్పీ, షాంగై కాంపోజిట్లు కూడా నష్టాలు చవిచూశాయి.
ఇదీ చూడండి: రెడ్మీ సూపర్ బడ్జెట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్!