ETV Bharat / business

ఆరంభ లాభాలు ఆవిరి.. మార్కెట్లకు స్వల్ప నష్టాలు - నిప్టీ

ఆరంభంలో లాభాలతో సానుకూలంగా స్పందించిన స్టాక్ మార్కెట్లు చివరకు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 59 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 8 పాయింట్ల నష్టంతో ఫ్లాట్​గా స్థిరపడింది.

stocks close in red note
స్టాక్ మార్కెట్లకు నష్టాలు
author img

By

Published : Aug 13, 2020, 3:45 PM IST

స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిశాయి. గురువారం సెషన్​లో బీఎస్​ఈ-సెన్సెక్స్ 59 పాయింట్లు కోల్పోయి 38,310 వద్దకు చేరింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 8 పాయింట్ల స్వల్ప నష్టంతో 11,300 వద్ద ఫ్లాట్​గా స్థిరపడింది.

అంతర్జాతీయ సానుకూలతలతో ఆరంభంలో సానుకూలంగా స్పందించిన సూచీలు.. అమ్మకాల ఒత్తిడితో చివరకు నష్టాలను నమోదు చేశాయి.

ఇటు దేశీయంగా, అటు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతుండటం వల్ల మదుపరులు కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 38,517 పాయింట్ల అత్యధిక స్థాయి, 38,215 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 11,359 పాయింట్ల గరిష్ఠ స్థాయి;11,270 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఎల్​&టీ, టైటాన్​, ఎన్​టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా, ఓఎన్​జీసీ షేర్లు లాభాలతో ముగిశాయి.

భారతీ ఎయిర్​టెల్​, సన్​ఫార్మా, ఐటీసీ, ఇండస్​ఇండ్ బ్యాంక్, ఎస్​బీఐ, పవర్​గ్రిడ్​ షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

ఆసియా మార్కెట్లు..

ఆసియాలో ప్రధాన మార్కెట్లు అయిన హాంకాంగ్​ మినహా.. షాంఘై, టోక్యో​, సియోల్​ సూచీలు లాభాలతో ముగిశాయి.

రూపాయి..

కరెన్సీ మార్కెట్​లో రూపాయి గురువారం దాదాపు ఫ్లాట్​గా ముగిసింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ రూ.74.84 వద్ద ఉంది.

ఇదీ చూడండి:టిక్​టాక్ కొనుగోలు రేసులో రిలయన్స్ ఇండస్ట్రీస్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.