స్టాక్ మార్కెట్లలో సోమవారం లాభాల ర్యాలీ కొనసాగింది. సెన్సెక్స్ 487 పాయింట్లు పెరిగి తొలిసారి 49,269 వద్ద(జీవనకాల గరిష్ఠం) స్థిరపడింది. నిఫ్టీ 137 పాయింట్ల లాభంతో 14,485 (జీవనకాల గరిష్ఠం)వద్దకు చేరింది.
ఐటీ, ఆటో షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి.
ఇంట్రాడేలో..
సెన్సెక్స్ 48,956 పాయింట్ల కనిష్టాన్ని.. 49,286 పాయింట్ల గరిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ 14,383 పాయింట్ల అత్యల్ప స్థాయిని, 14,488 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది.
హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఆటో, మారుతీ, టెక్ మహీంద్రా లాభాలను గడించాయి.
బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫినాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్&టీ, కోటక్ మహీంద్రా నష్టాలను చవిచూశాయి.
ఆసియా మార్కెట్లలో హాంకాంగ్ సూచీలు లాభాల్లో కొనసాగాయి. షాంఘై స్టాక్ ఎక్స్చేంజ్ నష్టాలతో ముగిసింది. ఐరోపా సూచీలు సైతం నష్టాల్లోనే కొనసాగాయి.
క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 1.52శాతం పెరిగి 55.14డాలర్ల వద్ద కొనసాగుతోంది.
ఇదీ కారణం..
జనవరి 16 నుంచి కరోనా టీకా పంపిణీ ఉన్న నేపథ్యంలో మార్కెట్లు ర్యాలీ కొనసాగించాయి. సమీప భవిష్యత్లో కార్పొరేట్ వ్యాపారాల్లో వృద్ధి అంచనాలు సైతం మార్కెట్లకు దన్నుగా నిలిచాయి.
విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగవచ్చన్న సంకేతాలు.. దేశీయ మదుపరులకు ఉత్సాహాన్నిచ్చాయి. దీంతోపాటు ముందస్తు బడ్జెట్ అంచనాలు.. సైతం మార్కెట్ల ర్యాలీకి కారణమయ్యాయని రిలయన్స్ సెక్యూరిటీస్ వ్యూహకర్త బినోద్ మోదీ తెలిపారు.
ఇదీ చదవండి: వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్... ఏది సేఫ్?