ETV Bharat / business

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు- సెన్సెక్స్ 600 మైనస్ - స్టాక్ మార్కెట్ వార్తెలు లైవ్

STOCKS LIVE NEWS
స్టాక్ మార్కెట్లు లైవ్
author img

By

Published : Oct 28, 2020, 9:31 AM IST

Updated : Oct 28, 2020, 4:05 PM IST

15:46 October 28

ఎయిర్​టెల్​ 4 శాతానికిపైగా వృద్ది...

భారత స్టాక్ మార్కెట్లు బుధవారం భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 600 పాయింట్లు కోల్పోయి 39,922 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 160 పాయింట్ల నష్టంతో 11,729 వద్దకు చేరింది.

అంతర్జాతీయ, దేశీయ ప్రతికూలతలు నష్టాలకు కారణంగా తెలుస్తోంది.

  • భారతీ ఎయిర్​టెల్, ఎం&ఎం, మారుతీ షేర్లు లాభాలను గడించాయి.
  • ఇండస్​ఇండ్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, టెక్ మహీంద్రా, బజాజ్ ఫినాన్స్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

14:47 October 28

సెన్సెక్స్ 550 మైనస్..

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 550 పాయింట్లు కోల్పోయి.. 39,983 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ దాదాపు 150 పాయింట్ల నష్టంతో 11,742 వద్ద ట్రేడవుతోంది.

దాదాపు అన్ని రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

  • 30 షేర్ల ఇండెక్స్​లో భారతీ ఎయిర్​టెల్, మారుతీ, ఎం&ఎం, బజాజ్ ఆటో షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి.
  • హెచ్​డీఎఫ్​సీ, ఇండస్​ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్​, టెక్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

12:18 October 28

సెన్సెక్స్ 200 పాయింట్లు మైనస్

స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాల దిశగా కదులుతున్నాయి. మిడ్​ సెషన్​లో సెన్సెక్స్ దాదాపు 200 పాయింట్ల నష్టంతో 40,326 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 40 పాయింట్లకుపైగా తగ్గి 11,845 వద్ద కొనసాగుతోంది.

బ్యాంకింగ్ సహా రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్​ వంటి హెవీ వెయిట్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నష్టాలకు కారణంగా తెలుస్తోంది.

  • భారతీ ఎయిర్​టెల్, మారుతీ, ఎం&ఎం, బజాజ్ ఫిన్​సర్వ్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • హెచ్​డీఎఫ్​సీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్​సీఎల్​టెక్, టైటాన్, టెక్ మహీంద్రా, ఇండస్​ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:40 October 28

సెన్సెక్స్​ 40+

స్టాక్ మార్కెట్లు లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఆరంభంలో సానుకూలంగా స్పందించిన సూచీలు కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. తిరిగి మళ్లీ ప్రస్తుతం స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి.

సెన్సెక్స్ 40 పాయింట్లకుపైగా లాభంతో 40,565 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 20 పాయింట్లకుపైగా పెరిగి 11,911 వద్ద ట్రేడవుతోంది.

టెలికాం, వాహన, ఐటీ షేర్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి. రిలయన్స్ వంటి హెవీ వెయిట్ షేర్లు లాభాలకు ఊతమిస్తున్నట్లు తెలుస్తోంది.

భారతీ ఎయిర్​టెల్, ఎం&ఎం, మారుతీ, బజాజ్ ఫిన్​సర్వ్, ఎన్​టీపీసీ, బజాజ్ ఫినాన్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

కోటక్ మహీంద్రా, హెచ్​డీఎఫ్​సీ, హెచ్​యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

08:56 October 28

నష్టాల్లోనూ భారతీ ఎయిర్​టెల్ దూకుడు..

స్టాక్ మార్కెట్లు బుధవారం ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 14 పాయింట్ల స్వల్ప నష్టంతో 40,444 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 10 పాయింట్లకుపైగా కోల్పోయి 11,889 వద్ద కొనసాగుతోంది.

మార్కెట్లు ప్రతికూలంగా స్పందిస్తున్నా.. రెండో త్రైమాసికంలో ఆదాయం పెరిగిన నేపథ్యలో భారతీ ఎయిర్​టెల్ భారీ లాభంతో కొనసాగుతోంది. 30 షేర్ల ఇండెక్స్​లో అగ్రస్థానంలో నిలిచింది. బ్యాంకింగ్ షేర్లు ఒడుదొడుకుల్లో కొనసాగుతన్నాయి. 

ఎం&ఎం, ఎల్​&టీ, బజాజ్ ఫినాన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్​యూఎల్​, నెస్లే, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Last Updated : Oct 28, 2020, 4:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.