ఆటో, విద్యుత్, ఇన్ఫ్రా, ఫార్మా రంగాల షేర్ల కొనుగోళ్లతో స్టాక్‌మార్కెట్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. భారీ విదేశీ నిధుల ప్రవాహం మధ్య.. ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఆర్‌ఐఎల్‌లు లాభాల్లోకి వచ్చాయి. వచ్చే వారం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో.. వృద్ధి అంచనాలతో మదుపర్లు ఉత్సాహంగా కొనుగోళ్లు జరుపుతున్నారు.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 125 పాయింట్ల లాభంలో ఉంది. ప్రస్తుతం 39వేల 560 వద్ద కొనసాగుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ స్వల్ప లాభం నమోదు చేసింది. ఆరంభ ట్రేడింగ్‌లో ఫ్లాట్‌గా ట్రేడయిన నిఫ్టీ.. అనంతరం 11వేల 800 మార్కును దాటింది. ప్రసుతం 30 పాయింట్ల వృద్ధితో 11 వేల 826 వద్ద ఉంది.
అమెరికాలో ఫెడ్ వడ్డీ రేట్లు మళ్లీ తగ్గిస్తామన్న సంకేతాలూ.. దేశీయ మార్కెట్ల లాభాలకు మరో కారణం.
ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్‌కు భారీ లాభాలు..
సెన్సెక్స్ 30 షేర్లలో పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, సన్ ఫార్మా భారీ లాభాలను నమోదు చేశాయి. ఎల్ అండ్ టీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, వేదాంత 2 శాతానికి పైగా లాభాలు పొందాయి.
టాటా స్టీల్, బజాజ్ ఫినాన్స్, హెచ్‌యూఎల్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ నష్టాల జాబితాలో ఉన్నాయి.
రూపాయి 10 పైసలు పతనం..
ఆరంభ ట్రేడింగ్‌లో రూపాయి బలహీనపడింది. 10 పైసలు క్షీణించింది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ 69. 46 వద్ద ఉంది.
ముడిచమురు ధరలు బుధవారం.. ఒక శాతం మేర పెరిగాయి. ఇప్పటికే అమెరికా-ఇరాన్ వాణిజ్య యుద్ధం ఆందోళనలతో బలహీనంగా మారిన మార్కెట్లపై ఇది ప్రతికూల ప్రభావం చూపనుంది.