స్టాక్ మార్కెట్లు బుధవారం(stock market today) స్వల్ప నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 77 పాయింట్లు కోల్పోయి 58,927 పాయింట్ల వద్ధ స్థిరపడింది. నిఫ్టీ 15 పాయింట్లు నష్టపోయి 17,546 వద్ద ముగిసింది.
ఉదయం సెషన్‌ను లాభాలతోనే ఆరంభించిన సూచీలు(stock market news).. ఆ తర్వాత అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు, ఫార్మా, లోహ షేర్ల అమ్మకాల ఒత్తిడితో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి(stock market news in telugu). చివరకు స్వల్ప నష్టాలను చవిచూశాయి.
కోల్ ఇండియా, టెక్ మహీంద్ర షేర్లు 3.5శాతానికిపైగా వృద్ధి చెందాయి. హిందాల్కో, టాటా మోటార్ల్ ఎం&ఎం షేర్లు కూడా లాభాలతో ముగిశాయి
హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్ర, ఒఎన్జీసీ షేర్లు ఒక శాతానికిపైగా నష్టపోయాయి.