స్టాక్ మార్కెట్ల లాభాల జోరుకు గురువారం బ్రేక్ పడింది. బీఎస్ఈ-సెన్సెక్స్ 323 పాయింట్లు తగ్గి 38,980 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 85 పాయింట్ల నష్టంతో 11,519 వద్దకు చేరింది.
కరోనా నేపథ్యంలో కుదేలైన ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపై ఫెడరల్ రిజర్వు ఆందోళనతో.. అమెరికా మార్కెట్లు బుధవారం నష్టాలను నమోదు చేశాయి. ఆ ప్రభావం దేశీయ సూచీలపైనా పడినట్లు తెలుస్తోంది. మరోవైపు దేశీయ ఆర్థిక వృద్ధి రేటుపై రేటింగ్ ఏజెన్సీలు విడుదల చేస్తున్న ప్రతికూల అంచనాల నేపథ్యంలో మదుపరులు అమ్మకాలపై దృష్టి సారించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ఇంట్రాడే సాగిందిలా
సెన్సెక్స్ 39,234 పాయింట్ల అత్యధిక స్థాయి, 38,926 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 11,587 పాయింట్ల గరిష్ఠ స్థాయి;11,498 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
హెచ్‌సీఎల్‌టెక్, ఇన్ఫోసిస్, మారుతీ, అల్ట్రాటెక్ సిమెంట్, ఓఎన్జీసీ షేర్లు లాభాలను గడించాయి.
బజాజ్ ఫిన్సర్వ్, పవర్‌గ్రిడ్, ఎల్&టీ, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఆసియా మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై, టోక్యో, సియోల్, హాంకాంగ్ సూచీలూ గురువారం నష్టాలను నమోదు చేశాయి.
రూపాయి, ముడి చమురు
కరెన్సీ మార్కెట్లో రూపాయి గురువారం 14 పైసలు తగ్గింది. దీనితో డాలర్‌తో పోలిస్తే మారకం విలువ రూ.73.66 వద్దకు చేరింది.
ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ భారీగా 0.33 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 42.08 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి:హ్యుమన్ క్యాపిటల్ ఇండెక్స్‌లో భారత్@116