అంతర్జాతీయ సానుకూలతలతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెనెక్స్ 206.53 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం 38,439.94 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 48.90 పాయింట్లు పుంజుకుని 11,500 పాయింట్ల స్థాయిని తాకింది. ప్రస్తుతం 11,532.15 వద్ద కొనసాగుతోంది.
సెన్సెక్స్‌లో బ్యాంకింగ్ రంగ షేర్లు ఆకట్టుకుంటున్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంకు, వేదాంత, యస్ బ్యాంకు, ఎస్బీఐ, ఎల్అండ్టీ, యాక్సిస్ బ్యాంకు, కోటక్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు లాభాల జాబితాలో ప్రధానంగా కనిపిస్తున్నాయి.
హీరో మోటోకార్ప్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఎస్టీపీసీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
30 షేర్ల ఇండెక్స్‌లో 24 షేర్లు లాభాల్లో ట్రేడవుతుండగా...6 షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.