భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌మార్కెట్లు చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. కరోనా భయాలకు తోడు అంతర్జాతీయ ప్రతికూలతలు మార్కెట్‌పై ప్రభావం చూపించాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 190 పాయింట్లు కోల్పోయి 31 వేల 371 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 42 పాయింట్లు నష్టపోయి 9 వేల 196 వద్ద స్థిరపడింది.
లాభనష్టాల్లో
ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, బజాజ్ ఆటో, పవర్‌గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంకు, టైటాన్ రాణించాయి.
రిలయన్స్, ఏసియన్ పెయింట్స్, కోటక్ బ్యాంకు, ఓఎన్జీసీ, నెస్లే ఇండియా, టాటా స్టీల్ నష్టపోయాయి.