నష్టాల్లోనూ ఐటీ జోరు..
స్టాక్ మార్కెట్లు భారీ లాభాల నుంచి ఒక్క సారిగా నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 160 పాయింట్లకుపైగా నష్టంతో 38,688 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 50 పాయింట్లు తగ్గి 11,415 వద్ద కొనసాగుతోంది.
ఆరంభ లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. ఆర్థిక షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఐటీ షేర్లు మాత్రం లాభాల జోరును కొనసాగిస్తున్నాయి.
- హెచ్‌సీఎల్‌టెక్(9.50 శాతం), టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, బజాజ్ ఆటో షేర్లు లాభాల్లో ఉన్నాయి.
- భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫినాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, సన్‌ఫార్మా, హెచ్‌యూఎల్, హెచ్డీఎఫ్సీ షేర్లు నష్టాల్లో ప్రధానంగా ఉన్నాయి.