ETV Bharat / business

రెండో రోజూ నష్టాలే.. సెన్సెక్స్ 46 పాయింట్లు మైనస్​ - నేటి స్టాక్ మార్కెట్లు

stocks today
నేటి స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Jun 30, 2020, 10:01 AM IST

Updated : Jun 30, 2020, 3:51 PM IST

15:44 June 30

ఆరంభంలో లాభాలు.. చివరకు నష్టాలు

ఆరంభంలో లాభాలు నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు చివరకు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 46 పాయింట్లు కోల్పోయి 34,916 వద్దకు చేరింది. నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో 10,302 వద్ద స్థిరపడింది.

  • హెవీ వెయిట్​ షేర్లు చివరి గంటలో అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవడం నష్టాలకు కారణంగా తెలుస్తోంది.
  • మారుతీ, నెస్లే, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్ షేర్లు లాభపడ్డాయి.
  • పవర్​గ్రిడ్, సన్​ఫార్మా, ఐటీసీ, ఓఎన్​జీసీ, భారతీ ఎయిర్​టెల్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

14:41 June 30

బ్యాంకింగ్, ఐటీ షేర్లలో అమ్మకాలు..

స్టాక్​ మార్కెట్లు సెషన్ చివరి గంటలో నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ దాదాపు 60 పాయింట్లు కోల్పోయి 34,905 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 30 పాయింట్లకుపైగా నష్టంతో 10,281 వద్దకు చేరింది.

  • బ్యాంకింగ్, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నష్టాలకు కారణంగా తెలుస్తోంది.
  • నెస్లే, మారుతీ, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్​టీపీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • సన్​ఫార్మా, పవర్​గ్రిడ్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఓఎన్​జీసీ, ఇండస్​ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

11:23 June 30

లాభాల్లో స్థిరంగా సూచీలు..

స్టాక్ మార్కెట్లు లాభాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 210 పాయింట్లకుపైగా లాభంతో 35,173 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 60 పాయింట్లకుపైగా పుంజుకుని 10,373 వద్ద కొనసాగుతోంది.

రిలయన్స్ సహా హెవీ వెయిట్ షేర్లు సానుకూలంగా స్పందిస్తుండటం లాభాలకు కారణంగా తెలుస్తోంది.

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు అన్నీ కూడా సానుకూలంగా స్పందిస్తుండటం దేశీయ సూచీలకు కలిసొస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.  

టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, ఎన్​టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతీ షేర్లు లాభాల్లో  ఉన్నాయి.

సన్​ఫార్మా, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఓఎన్​జీసీ, బజాజ్ ఆటో, పవర్​గ్రిడ్​, హెచ్​యూఎల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

ముడి చమురు ధరల సూచీ- బ్రెంట్ 0.53 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్​లో బ్యారెల్ ముడి చమురు ధర 41.63 డాలర్ల వద్ద ఉంది.

09:49 June 30

లాభాల్లో స్టాక్​ మార్కెట్లు

దేశీయ స్టాక్​ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం బీఎస్​ఈ- సెన్సెక్స్​ దాదాపు 200 పాయింట్ల లాభంతో 35,161 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 70 పాయింట్లకుపైగా బలపడి 10,384 వద్ద ట్రేడవుతోంది.

హెవీ వెయిట్​ షేర్లు లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి. ఆర్థిక రంగ షేర్లూ సానుకూలంగా స్పందిస్తున్నాయి. చివరి సెషన్​లో నమోదైన భారీ నష్టాల నుంచి యాక్సిస్ బ్యాంక్ షేర్లు రికవరి దిశగా కొనసాగుతున్నాయి.

టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్​టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్​డీఎఫ్​సీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

సన్​ఫార్మా, టీసీఎస్​, ఇన్ఫోసిస్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, పవర్​గ్రిడ్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

Last Updated : Jun 30, 2020, 3:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.