ETV Bharat / business

ఎన్నికలు, మళ్లీ లాక్​డౌన్​ అంశాలే మార్కెట్లకు కీలకం! - మార్కెట్లపై కరోనా రెందో దశ ప్రబావం

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం, ఐరోపాలో భారీగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో.. తాజా పరిణామాలు దేశీయ మార్కెట్లకు దిశా నిర్దేశం చేయనున్నాయి. దేశీయంగా కీలక ఆర్థిక గణాంకాలు, కంపెనీల త్రైమాసిక ఫలితాలు కూడా మార్కెట్లను ప్రభావితం చేసే ప్రధాన అంశాలుగా విశ్లేషకులు చెబుతున్నారు.

Corona Second wave impact on Stock markets
ఈ వారం స్టాక్ మార్కెట్లపై అంచనాలు
author img

By

Published : Nov 1, 2020, 1:26 PM IST

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం కూడా ఒత్తిడికి లోనవ్వొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ఐరోపాలో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు ఇందుకు కారణాలుగా చెబుతున్నారు.

'పెరుగుతున్న కరోనా కేసులను అదుపు చేసేందుకు పలు ఐరోపా దేశాలు మళ్లీ లాక్​డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అనిశ్చితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలు మదుపరుల సెంటిమెంట్​ను దెబ్బతీయొచ్చు.' అని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అంచనాలకు మించి వస్తున్న ఫలితాలు, కీలక ఆర్థిక గణాంకాలు మార్కెట్లకు ఈ వారం కాస్త సానుకూల పరిణామాలుగా చెబుతున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా ఈ వారం హెచ్​డీఎఫ్​సీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్​ క్యూ2 ఫలితాలు, వాహన విక్రయాల గణాంకాలు మార్కెట్లకు కాస్త సానుకూల అంశాలుగా మారొచ్చని స్టాక్ బ్రోకర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

తయారీ, సేవా రంగాల పీఎంఐ గణాంకాలు ఈ వారం విడుదల కానున్నాయి. ఈ లెక్కలు మార్కెట్ల ట్రేడింగ్​ సెంటిమెంట్​ను ప్రభావితం చేయొచ్చని చెబుతున్నారు.

"2020-21లో క్యూ2లో చమురు వ్యాపారాల నికర లాభం 15 శాతం తగ్గినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో సోమవారం సెషన్​పై ఈ ప్రభావం అధికంగా ఉండొచ్చు. ఆ తర్వాత సెషన్ల నుంచి మదుపరుల దృష్టి అంతర్జరాతీయ పరిణామాలవైపు వెళ్లొచ్చు."

-అజిత్ మిశ్రా, రెలిగేర్ బ్రోకరేజ్ లిమిటెడ్ రిసేర్చ్ విభాగ ఉపాధ్యక్షుడు

వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్​ నిర్ణయాలపై కూడా మదుపరులు దృష్టి సారించే అవకాశముందని మార్కెట్ నిపుణులు వివరిస్తున్నారు.

వీటన్నింటితోపాటు రూపాయి, ముడి చమురు ధరల్లో హెచ్చు తగ్గులు మార్కెట్లను ప్రభావితం చేసే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.

ఇదీ చూడండి:8 నెలల తర్వాత రూ.లక్ష కోట్లపైకి జీఎస్​టీ వసూళ్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.