ETV Bharat / business

ఒడుదొడుకుల ట్రేడింగ్​లో చివరకు లాభాలు

స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 45 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 6 పాయింట్లు పుంజుకుంది. సెషన్ మొత్తం ఒడుదొడుకులకు ఎదుర్కొన్న సూచీలు.. ఆర్థిక షేర్ల దన్నుతో చివరకు స్వల్ప లాభాలను నమోదు చేయడం గమనార్హం.

stocks today
నేటి స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Aug 25, 2020, 3:44 PM IST

Updated : Aug 25, 2020, 5:15 PM IST

ఒడుదొడుకుల ట్రేడింగ్​లో స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 45 పాయింట్లు పెరిగి 38,844 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 6 పాయింట్ల లాభంతో 11,472 వద్ద ఫ్లాట్​గా ముగిసింది.

ఇటీవలి లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడటం, ఆగస్టు నెల డెరివేటివ్స్​ గడువు ముగియనున్న నేపథ్యంలో మార్కెట్లు సెషన్​ మొత్తం ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ పవనాలు కూడా ఇందుకు కారణమయ్యాయి. ఆర్థిక షేర్లలో నమోదైన కొనుగోళ్లతో చివరకు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి సూచీలు.

ఇంట్రాడే సాగిందిలా

సెన్సెక్స్ 39,009 పాయింట్ల అత్యధిక స్థాయి, 38,680 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 11,526 పాయింట్ల గరిష్ఠ స్థాయి;11,423 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

బజాజ్ ఫినాన్స్, ఎస్​బీఐ, టెక్​ మహీంద్రా, ఏషియన్​ పెయింట్స్, బజాజ్ ఫిన్​సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్ లాభాలను గడించాయి.

దేశంలో రెండో అతి పెద్దదైన ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్ట్​ను దక్కించుకునేందుకు..​ అదానీ గ్రూప్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అదానీ ఎంటర్​ప్రైజెస్ షేర్లు మంగళవారం 20 శాతం పెరిగాయి.

ఎన్​టీపీసీ, సన్​ఫార్మా, నెస్లే, టాటా స్టీల్​, ఎల్​&టీ, ఇన్ఫోసిస్​ షేర్లు నష్టపోయాయి.

ఆసియా మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు అయిన టోక్యో, కోస్పీ సూచీలు లాభాలతో ముగిశాయి. షాంఘై, హాంకాంగ్ సూచీలూ నష్టాలను నమోదు చేశాయి.

రూపాయి

కరెన్సీ మార్కెట్​లో రూపాయి విలువ మంగళవారం స్వల్పంగా నష్టపోయింది. దీనితో డాలర్​తో పోలిస్తే మారకం విలువ 74.33 వద్దకు చేరింది.

మార్కెట్లో నేడు

ఇదీ చూడండి:ప్రత్యేక ఓఎంఓ ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీల వేలం

Last Updated : Aug 25, 2020, 5:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.