Stock Market Outlook: ఈ వారం స్టాక్ మార్కెట్లకు పలు కీలక అంశాలు దిశా నిర్దేశం చేయనున్నాయి. ప్రస్తుతం అందరి చూపు కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పైనే ఉంది. దీంతో పాటు స్థూల ఆర్థిక గణాంకాలు, సంస్థల త్రైమాసిక లాభాల ప్రకటన, అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం మార్కెట్లను నడిపించనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
"మార్కెట్లతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ వారం ఎంతో కీలమైంది. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేలా.. అభివృద్ధి అజెండాతో సానుకూల నిర్ణయాలు ఉంటాయని మదుపరులు ఆశిస్తున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టే వారంలో సూచీల్లో ఒడుదొడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ మదుపరుల అమ్మకాల నేపథ్యంలో బడ్జెట్.. దేశీయ మార్కెట్లను నడిపించనుంది. పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది."
-అజిత్ మిశ్రా, రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ ఉపాధ్యక్షుడు
కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటాయి. బడ్జెట్ అనంతరం పుంజుకునే అవకాశం ఉంది. గత ఏడాది ఇదే ధోరణి కనిపించింది. బడ్జెట్‌కు ముందు అమ్మకాలు వెల్లువెత్తాయి. బడ్జెట్ తర్వాత సూచీలు పుంజుకున్నాయి. మూడో త్రైమాసికంలో సంస్థల లాభాల ప్రకటనపై మదుపరుల దృష్టి సారించే అవకాశముంది."
- సంతోష్ మీనా, స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్
బడ్జెట్ కాకుండా.. అంతర్జాతీయంగా డాలర్ విలువ, చముర ధరల పెరుగుదల వంటివి దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపవచ్చని మీనా అంచనా వేశారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: 2030 కల్లా పది లక్షల ఉద్యోగాలు!- ఆ ఒక్క రంగంలోనే..