ఆర్థిక మందగమనం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్బీఐ కీలక వడ్డీరేట్లు తగ్గించే అవకాశం లేదనే విశ్లేషణల నడుమ మదుపరుల సెంటిమెంటు దెబ్బతింది. ఫలితంగా దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 114 పాయింట్లు కోల్పోయి 41 వేల 837 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 40 పాయింట్లు నష్టపోయి 12 వేల 321 వద్ద ట్రేడవుతోంది.
లాభనష్టాల్లో
టెక్ మహీంద్రా, హీరో మోటోకార్ప్, హెచ్‌సీఎల్ టెక్, రిలయన్స్, టైటాన్ కంపెనీ, భారతీ ఇన్ఫ్రాటెల్, గెయిల్ రాణిస్తున్నాయి.
ఎస్ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, విప్రో, టాటా స్టీల్, వేదాంత, ఆల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంకు, ఎమ్ అండ్ ఎమ్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఆసియా మార్కెట్లు
యూఎస్-చైనా మొదటి దఫా వాణిజ్య ఒప్పందంలో డ్రాగన్ ఉత్పత్తులపై సుంకాలు తగ్గించే అంశమేదీ లేదని అమెరికా చేసిన ప్రకటన... ఆసియా మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఫలితంగా నిక్కీ, కోస్పీ, హాంగ్‌సెంగ్, షాంగై కాంపోజిట్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
రూపాయి విలువ
రూపాయి విలువ 8 పైసలు తగ్గింది. ప్రస్తుతం ఒక డాలరుకు రూ.70.96గా ఉంది.
ముడిచమురు ధర
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 0.23 శాతం తగ్గింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 64.34 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి: 'చైనాతో వాణిజ్య ఒప్పందంలో సుంకాల తగ్గింపు అంశమే లేదు'