సరిహద్దు భయాలు..
స్టాక్ మార్కెట్లుకు లాభాలు ఒక్క రోజు ముచ్చటగానే మిగిలాయి. మంగళవారం సానుకూలంగా ముగిసిన సూచీలు.. బుధవారం మళ్లీ నష్టాలను నమోదు చేశాయి.
సెన్సెక్స్ 97 పాయింట్ల నష్టంతో 33,508 వద్దకు చేరింది. జాతీయ స్టాక్ నిఫ్టీ 33 పాయింట్లు కోల్పోయి 9,981 వద్ద స్థిరపడింది.
భారత్-చైనా సరిహద్దు వివాదంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న భయాలతో మదుపరులు అప్రమత్తత పాటించడం నష్టాలకు ప్రధాన కారణం.