ETV Bharat / business

Stock Market: లాభాలతో ముగిసిన మార్కెట్లు- సెన్సెక్స్ 476 ప్లస్​ - స్టాక్ మార్కెట్ వార్తలు

stock market live updates
స్టాక్​ మార్కెట్​ లైవ్ అప్డేట్స్​
author img

By

Published : Sep 15, 2021, 9:34 AM IST

Updated : Sep 15, 2021, 3:43 PM IST

15:41 September 15

స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 476 పాయింట్లు పెరిగి నూతన గరిష్ఠమైన 58,723 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 139 పాయింట్ల లాభంతో జీవనకాల గరిష్ఠమైన 17,519 వద్దకు చేరింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఎన్​టీపీసీ, భారతీ ఎయిర్​టెల్, టైటాన్​, హెచ్​సీఎల్​టెక్​, ఎస్​బీఐ భారీగా లాభాలను గడించాయి.

ఏషియన్ పెయింట్స్, యాక్సిస్​ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్​ ఫినాన్స్, నెస్లే ఇండియా నష్టాలతో ముగిశాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. కోస్పీ (దక్షిణ కొరియా) సూచీ లాభాలను గడించింది. షాంఘై (చైనా), నిక్కీ (జపాన్​), హాంగ్​సెంగ్ (హాంకాంగ్​) సూచీలు నష్టాలను నమోదు చేశాయి.

12:01 September 15

భారీ లాభాల్లో మార్కెట్లు..

స్టాక్​ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్​ 300 పాయింట్లకుపైగా పెరిగి.. 58 వేల 500 ఎగువన ట్రేడవుతోంది. నిఫ్టీ 80 పాయింట్లకుపైగా వృద్ధి చెంది.. 17 వేల 400 ఎగువన కొనసాగుతోంది.

ఎన్​టీపీసీ, ఓఎన్​జీసీ, భారతీ ఎయిర్​టెల్​, టైటాన్​, హెచ్​సీఎల్​ టెక్​ లాభాల్లో ఉన్నాయి.

బీపీసీఎల్​, యాక్సిస్​ బ్యాంక్​, గ్రేసిమ్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 

09:09 September 15

స్టాక్​ మార్కెట్ లైవ్ అప్డేట్స్​

స్టాక్​ మార్కెట్లు(stock market) వరుసగా రెండో రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు కనిపిస్తున్నందున మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయినా సూచీలు లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ 118 పాయింట్ల లాభపడి 58,365 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 36 పాయింట్లు వృద్ధి చెంది 17,416 వద్ద కదలాడుతోంది.

టైటాన్ కంపెనీ, ఓఎన్​జీసీ, భారతీ ఎయిర్​టెల్​, బజాజ్​ ఆటో షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

యాక్సిస్ బ్యాంక్, ఇండస్​ఇండ్​ బ్యాంక్, బీపీసీఎల్​, కోటక్​ మహీంద్రా, హెచ్​డీఎఫ్​సీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Last Updated : Sep 15, 2021, 3:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.