ETV Bharat / business

ఆరంభ లాభాలు ఆవిరి- రికార్డు స్థాయిల నుంచి వెనక్కి

stock market live updates
స్టాక్​ మార్కెట్లు
author img

By

Published : Jan 21, 2021, 9:21 AM IST

Updated : Jan 21, 2021, 3:48 PM IST

15:42 January 21

అదరగొట్టిన బజాజ్ షేర్లు..

స్టాక్ మార్కెట్లు గురువారం చారిత్రక రికార్డు స్థాయిలను తాకినా వాటిని చివరి వరకు నిలబెట్టుకోలేకపోయాయి. చివరి గంటలో లాభాల స్వీకరణ కారణంగా బీఎస్​ఈ-సెన్సెక్స్ 167 పాయింట్లు తగ్గి 49,624 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 54 పాయింట్లు కోల్పోయి 14,590 వద్దకు చేరింది.

  • బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఆటో, రిలయన్స్, బజాజ్ ఫిన్​సర్వ్​, ఏషియన్ పెయింట్స్ లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • ఓఎన్​జీసీ, భారతీ ఎయిర్​టెల్, ఎస్​బీఐ, ఇండస్​ఇండ్ బ్యాంక్, ఎన్​టీపీసీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

12:36 January 21

నిఫ్టీ 100 ప్లస్​..

స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. మిడ్​ సెషన్ తర్వాత సెన్సెక్స్ 360 పాయింట్ల లాభంతో నూతన రికార్డు స్థాయి అయిన 50,153 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 100 పాయింట్ల వృద్ధితో సరికొత్త గరిష్ఠమైన 14,744 వద్ద కొనసాగుతోంది.

  • బజాజ్ ఫిన్​సర్వ్, బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఆటో, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్కసిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • టీసీఎస్​, హెచ్​డీఎఫ్​సీ, భారతీ ఎయిర్​టెల్, ఓఎన్​జీసీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

09:59 January 21

బజాజ్ షేర్లు భళా..

స్టాక్ మార్కెట్లు కొత్త రికార్డులు నెలకొల్పాయి. సెన్సెక్స్ 260 పాయింట్లకుపైగా లాభంతో చరిత్రలో తొలిసారి 50,053 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా దాదాపు 70 పాయింట్లు పుంజుకుని జీవనకాల గరిష్ఠమైన 14,712 వద్ద కొనసాగుతోంది.

ఆర్థిక, ఆటో షేర్లు లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి. ఫ్యూచర్ రిటైల్​ను స్వాధీనం చేసుకునేందుకు సెబీ ఎన్​ఓడీ ఇచ్చిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్​ షేర్లు భారీగా పుంజుకున్నాయి. ఈ సానుకూలతలన్నీ మార్కెట్లను ముందుకు నడిపిస్తున్నాయి.

  • బజాజ్ ఫిన్​సర్వ్, బజాజ్​ ఫినాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఆటో, ఇండస్​ఇండ్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • టీసీఎస్​, హెచ్​డీఎఫ్​సీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, భారతీ ఎయిర్​టెల్, సన్​ఫార్మా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

09:02 January 21

ఆల్​టైం రికార్డు- 50వేల మార్కును దాటిన సెన్సెక్స్​

స్టాక్​ మార్కెట్లు సరికొత్త రికార్డు దిశగా దూసుకుపోతున్నాయి. వరుసగా మూడో రోజు లాభాలతో ప్రారంభమైన సూచీలు ఓపెనింగ్ సెషన్​లోనే జీవనకాల గరిష్ఠాలను తాకాయి. బొంబాయి స్టాక్​ ఎక్సేజీ సెన్సెక్స్ 256 పాయింట్లకుపైగా​   లాభపడి 50వేల మార్కును అధిగమించింది. జాతీయ స్టాక్​ ఎక్సేంజీ నిఫ్టీ 72 పాయింట్లు వృద్ధి చెంది 14,717 వద్ద ట్రేడవుతోంది.

Last Updated : Jan 21, 2021, 3:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.