ETV Bharat / business

Stock Limits on Soyameal: సోయామీల్ నిల్వపై పరిమితులు - సోయామీల్ నిల్వపై పరిమితులు

Stock Limits on Soyameal: సోయామీల్ నిల్వలపై పరిమితులు విధించింది కేంద్రం. 2022 జూన్‌ వరకు ఈ పరిమితులు కొనసాగుతాయని పేర్కొంది. ధరల అదుపు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

soyameal
సోయామీల్
author img

By

Published : Dec 25, 2021, 6:12 AM IST

Stock Limits on Soyameal: సోయామీల్‌ నిల్వలపై కేంద్రం పరిమితులను విధించింది. పౌల్ట్రీ పరిశ్రమలో ముఖ్యమైన ముడి పదార్థం సోయామీల్‌ అన్న సంగతి తెలిసిందే. ధరలు పెరగకుండా చూడడం కోసం 2022 జూన్‌ 30 వరకు ఈ నిల్వలపై పరిమితులు కొనసాగుతాయని.. డిసెంబరు 23 నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయని ఒక అధికారిక ప్రకటన పేర్కొంది.

దీని ప్రకారం.. సోయామీల్‌ ప్రాసెసర్లు, మిల్లర్లు, ప్లాంట్‌ యజమానులు గరిష్ఠంగా ఉత్పత్తిని 90 రోజుల వరకు అట్టేపెట్టి ఉంచుకోవచ్చు. స్టోరేజీ ప్రాంతాన్ని వారు ప్రకటించాల్సి ఉంటుంది. ప్రభుత్వ నమోదిత ట్రేడింగ్‌ కంపెనీలు, ట్రేడర్లు, ప్రైవేటు దుకాణదార్లు 160 టన్నుల వరకు గరిష్ఠంగా నిల్వ చేసుకోవచ్చు. వీరు కూడా నిల్వ ప్రాంతాన్ని చెప్పాల్సి ఉంటుంది. ఒక వేళ నిర్దిష్ట పరిమితి కంటే ప్రస్తుతం ఎక్కువ ఉంటే ఆ విషయాన్ని ఆహార మంత్రిత్వ శాఖ పోర్టల్‌కు వెల్లడించాలి. నోటిఫికేషన్‌ జారీ అయిన 30 రోజుల్లోగా వాటిని పరిమితి పరిధిలోకి తీసుకురావాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి:

Best investment plans: డిజిటల్‌ బంగారంతో లాభమేనా?

మార్కెట్​ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే ఇలా చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.