ETV Bharat / business

స్టాక్​ మార్కెట్లు: స్వల్ప వృద్ధి సాధించిన సెన్సెక్స్, నష్టాల్లో నిఫ్టీ

రూపాయి పతనం,అసియా మార్కెట్ల నష్టాల ప్రభావం వల్ల సూచీలు మిశ్రమ ఫలితాలతో ముగిశాయి. ఫెడ్​ రిజర్వ్​ విధాన నిర్ణయ ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో మదుపరులు జాగ్రత్తలు వహించారు. గురువారం హోలీ సందర్భంగా మార్కెట్లకు సెలవు.

author img

By

Published : Mar 20, 2019, 5:37 PM IST

స్టాక్​ మార్కెట్లు

వరుసగా ఏడు సెషన్లలో లాభాలు పొందిన స్టాక్​ మార్కెట్లు ఎనిమిదో సెషన్​ను మిశ్రమ ఫలితాలతో ముగించాయి. రూపాయి పతనం, ఆసియా మార్కెట్ల నష్టాల ప్రభావంతో సూచీలకు ఊగిసలాట తప్పలేదు. ఫెడ్​ రిజర్వ్​ విధాన నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో, అమెరికా- చైనా మధ్య వాణిజ్య చర్చలు విఫలం కావచ్చనే ఊహాగానాలతో అనేక మంది పెట్టుబడిదారులు కొనుగోళ్లు జరపకుండా జాగ్రత్త వహించారు.

23 పాయింట్ల వృద్ధితో 38,386 వద్ద సెన్సెక్స్​ ముగియగా, నిఫ్టీ 11పాయింట్ల నష్టంతో 11,521 వద్ద ముగిసింది.

ఇంతకుముందు ఏడు సెషన్లలో సూచీలు 1500 పాయింట్లు పైగా లాభపడ్డాయి.

గురువారం హోలీ సందర్భంగా మార్కెట్లకు సెలవు.

కుప్పకూలిన "జెట్"​ షేర్లు:

అప్పుల ఊబిలో కూరుకుపోయి, విమానాల లీజు చెల్లించలేని స్థితికి చేరుకున్న జెట్​ ఎయిర్​ వేస్​ సంస్థ షేర్లు మార్కెట్లో పేకమేడల్లా కూలిపోయాయి. ట్రేడింగ్​లో ఆ సంస్థ​ షేర్లు 7 శాతం మేర పతనమయ్యాయి.

ఆర్​కామ్​ షేర్ల జోరు:

అనిల్​ అంబానికి చెందిన ఆర్​కామ్​ సంస్థ షేర్లు సత్తా చాటాయి. ట్రేడింగ్​లో 10 శాతం వృద్ధి సాధించాయి.

లాభాలు గడించినవి ఇవే:

ఇన్ఫోసిస్​, హెచ్​డీఎఫ్​సీ, ఎల్​ అండ్​ టీ.

రూపాయి పతనం....ఐటీ జోరు:

రూపాయి పతనంతో ఐటీ షేర్లు లాభాల బాట పట్టాయి. సాఫ్ట్​వేర్​ ఎగుమతులకు చెల్లింపులు డాలర్​ రూపంలో జరుగుతాయి. అందుకే రూపాయి పతనం ఐటీ రంగానికి కలిసొచ్చే అంశం.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.