ETV Bharat / business

'రష్యా టీకా' ఉత్పత్తికి స్టెలిస్​ బయోఫార్మా ఒప్పందం - ఆర్​డీఐఎఫ్​

రష్యాకు చెందిన స్పుత్నిక్​ వి కొవిడ్​ టీకాను.. భారత్​కు చెందిన స్టెలిస్​ బయోఫార్మా తయారుచేయనుంది. ఇది బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది. దాదాపు 20 కోట్ల డోసుల వ్యాక్సిన్​ తయారీకి ఈ మేరకు ఒప్పందం కుదిరింది. మరోవైపు.. ఆక్స్​ఫర్డ్​-ఆస్ట్రాజెనెకా టీకాను యూకేకు అధికంగా సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీరం సంస్థ తెలిపింది.

author img

By

Published : Mar 21, 2021, 5:31 AM IST

రష్యా సంస్థ ఆర్‌డీఐఎఫ్‌ ఆవిష్కరించిన 'స్పుత్నిక్‌ వి' కొవిడ్‌-19 టీకాను మనదేశానికి చెందిన స్టెలిస్‌ బయోఫార్మా తయారుచేయనుంది. దాదాపు 20 కోట్ల డోసుల టీకా తయారు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఈ సంస్థలు వెల్లడించాయి. స్టెలిస్‌ బయోఫార్మా.. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్ట్రైడ్స్‌ ఫార్మా సైన్స్​కు బయోఫార్మాస్యూటికల్స్‌ విభాగం. మనదేశంలో ఆర్‌డీఐఎఫ్‌ తరఫున భాగస్వామిగా ఉన్న ఎస్నో హెల్త్‌కేర్‌ ఎల్‌ఎల్‌పీతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్టెలిస్‌ బయోఫార్మా పేర్కొంది.

ఈ ఏడాది మూడో త్రైమాసికం నుంచి టీకా సరఫరా ప్రారంభించాల్సి ఉంది. అవసరాలను బట్టి ఇంకా అధిక డోసులు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు 'స్టెలిస్‌' వివరించింది. స్పుత్నిక్‌ వి టీకాను పెద్ద సంఖ్యలో సరఫరా చేయడానికి ఈ ఒప్పందం దోహదపడుతుందని ఆర్‌డీఐఎఫ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కిరిల్‌ డిమిట్రివ్‌ పేర్కొన్నారు.

యూకేకు ఎక్కువ టీకాలు..

ఆక్స్‌ఫర్డ్‌- ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 టీకాను యూకే అవసరాలకు అనుగుణంగా అధికంగా సరఫరా చేయడానికి ప్రయత్నిస్తామని మనదేశానికి చెందిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్​ఐఐ) స్పష్టం చేసింది. ఈ టీకాను భారత్​ళో కొవిషీల్డ్‌ పేరుతో సీరం సంస్థ తయారుచేస్తోంది.

కొవిడ్‌-19 టీకాల సరఫరా తగ్గినట్లు ఇటీవల యూకేలోని నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌) ఆందోళన వెలిబుచ్చింది. దీనిపై ఎస్‌ఐఐ ప్రతినిధి స్పందిస్తూ కొద్దివారాల క్రితమే యూకేకు 50 లక్షల డోసులు టీకా సరఫరా చేశామని, తదుపరి మరికొన్ని డోసులు ఎగుమతి చేసేందుకు ప్రయత్నించనున్నట్లు పేర్కొన్నారు. మనదేశంలో టీకా అవసరాలను పరిగణనలోకి తీసుకుంటామని వివరించారు.

ఇదీ చూడండి: టీకాల ప్రభావం పెంచాలా? అయితే కలిపేద్దాం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.