ETV Bharat / business

పొదుపు​ మొత్తానికి  గరిష్ఠ వడ్డీ రేటు వర్తిస్తుందా? - సేవింగ్​ ఖాతాలపై వడ్డీ

పొదుపు​ ఖాతాల్లోని నగుదుకు కొన్ని బ్యాంకులు గరిష్ఠంగా 6-7.25 శాతం వరకు వడ్డీ రేటును ఇస్తున్నాయి. అయితే.. గరిష్ఠ వడ్డీ రేటు పొందాలంటే ఎంత బ్యాలెన్స్​ ఉండాలి. ఖాతాలోని మొత్తం నగదుకు ఈ వడ్డీ వర్తిస్తుందా? అనే విషయాలు మీకోసం..

Bank
బ్యాంకు
author img

By

Published : May 10, 2021, 3:32 PM IST

పొదుపు​ ఖాతాలో అత్యధిక సగటు బ్యాలెన్స్​ కొనసాగించే వారికి కొన్ని బ్యాంకులు గరిష్ఠంగా 7.25 శాతం వరకు వడ్డీని అందిస్తున్నాయి. ఈ ప్రకటన పొదుపు​ ఖాతాలో ఎక్కువ మొత్తం నగదు నిల్వ ఉంచేలా ఆశ పెడుతుంది. కానీ, ఇక్కడ ఓ కిటుకు ఉంది. బ్యాంకు చెప్పిన వడ్డీ రేటు మీ మొత్తం బ్యాలెన్స్​కు వర్తించదు. అందులో కొంత మొత్తానికి మాత్రమే గరిష్ఠ వడ్డీ రేటు వర్తిస్తుంది. అదేలాగో చూద్దాం.

బ్యాంకులకు పొదుపు​ ఖాతాల ద్వారా నగదు సమీకరణ చాలా తక్కువ వడ్డీకి, సులభంగా వస్తుంది. అందుకే చిన్న బ్యాంకులు శ్రేణి ఆధారిత వడ్డీ రేటు వ్యవస్థను అనుసరిస్తాయి. ఉదాహరణకు ఉత్కర్శ్ స్మాల్​ ఫైనాన్స్​​ బ్యాంకు​.. పొదుపు ఖాతాలో రూ.1 లక్ష వరకు 5 శాతం వడ్డీ అందిస్తోంది. రూ.1 లక్ష నుంచి రూ.25 లక్షల వరకు 6 శాతం వడ్డీ ఇస్తుంది. ఒకవేళ అంతకు మించి నగదును పొదుపు​ ఖాతాలో ఉంచితే మీరు 7.25 శాతం వరకు వడ్డీ పొందొచ్చు.

అదే విధంగా.. బంధన్​ బ్యాంక్​ పొదుపు​ ఖాతాల్లో రూ.1 లక్ష లోపు బ్యాలెన్స్​ నిల్వ ఉంచితే 3 శాతం వడ్డీ అందిస్తోంది. కానీ, ఖాతాలో లక్ష నుంచి రూ.10 కోట్ల లోపు ఉంటే ఈ విలువ 6 శాతం వరకు అందుతుంది. రూ.10 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ఉంటే 6.55 శాతం, రూ.50 కోట్లకుపైగా ఉంటే 7.15 శాతం మేర వడ్డీ ఇస్తోంది బంధన్​ బ్యాంకు.

మొత్తం నగదుకు గరిష్ఠ రేటు వర్తించదు..

పైన చెప్పినట్లు సేవింగ్​ ఖాతాలో ఉన్న మొత్తం నగదుకు గరిష్ఠ వడ్డీ రేటును కట్టి ఇవ్వవు బ్యాంకులు. ఒకవేళ మీరు రూ.51 కోట్లు సగటు బ్యాలెన్స్​ను బంధన్ బ్యాంకు ఖాతాలో నిల్వ ఉంచారనుకుంటే.. కేవలం రూ.1 కోటికి 7.15 శాతం వడ్డీ వస్తుంది. రూ. 40 కోట్లకు 6.55 శాతం, రూ.9.99 కోట్లకు 6 శాతం వడ్డీ వర్తిస్తుంది. మిగిలిన రూ.1 లక్షకు కేవలం 3 శాతం వడ్డీ వస్తుంది.

నిపుణులు ఏమంటున్నారు?

సేవింగ్​ ఖాతాల్లో నగదు నిల్వ ఉంచి మంచి వడ్డీ పొందాలనే భావన నుంచి బయటకు రావాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల బ్యాంకులు పొదుపు ఖాతాలపై వడ్డీలను క్రమంగా తగ్గిస్తూ రావటమే అందుకు కారణం. ఉదాహరణకు.. ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంకు ఇటీవల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను 6 శాతం నుంచి 4-5 శాతానికి తగ్గించింది. ఇది ఇతర బ్యాంకుల్లోనూ జరుగుతోంది. దీంతో ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకుల కోసం పరుగులు పెట్టాల్సిన అవసరం లేదనే విషయాన్ని గుర్తు చేస్తోందని పేర్కొంటున్నారు ఆర్థిక నిపుణలు.

కాబట్టి.. మీ మిగులు రాబడిని మంచి పేరున్న, ఆర్థికంగా బలంగా ఉండి దివాలా తీసే అవకాశాలు చాలా తక్కువగా ఉండే బ్యాంకులో దాచుకోవటం మంచిది.

ఇదీ చూడండి: 'వ్యాక్సిన్​ సాంగ్​'తో గూగుల్​ అవగాహన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.