ETV Bharat / business

బెస్ట్ క్వాలిటీ వీడియోలు వాట్సాప్​లో పంపెయ్యండిలా..

author img

By

Published : Jul 2, 2021, 10:34 PM IST

ప్రముఖ మెసేజింగ్ సంస్థ వాట్సాప్.. వీడియో అప్‌లోడ్ క్వాలిటీ పేరుతో మరో ఫీచర్​ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటివరకూ 16 ఎంబీ సామర్థ్యం కలిగిన మీడియా ఫైల్స్‌ను షేర్ చేసుకునే అవకాశం ఉండగా.. రాబోయే అప్‌డేట్‌లో వీడియో అప్‌లోడ్ క్వాలిటీని యూజర్స్ ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది.

wtsapp
బెస్ట్ క్వాలిటీ వీడియోలు వాట్సాప్​లో పంపెయ్యండిలా..

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో మరో సరికొత్త ఫీచర్‌ను యూజర్స్‌కు అందుబాటులోకి తీసుకురానుంది. వీడియో అప్‌లోడ్ క్వాలిటీ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్ సాయంతో యూజర్స్‌ తాము ఎంత క్వాలిటీతో వీడియోలను పంపాలనుకునేది నిర్ణయించుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ బీటా వెర్షన్‌ను ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం విడుదల చేసినట్లు వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది. వాట్సాప్‌ 16 ఎంబీ సామర్థ్యం కలిగిన మీడియా ఫైల్స్‌ను ఇతరులతో షేర్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. రాబోయే అప్‌డేట్‌లో వీడియో అప్‌లోడ్ క్వాలిటీని యూజర్స్ ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది.

ఇందులో ఆటో (రికమండెడ్), బెస్ట్‌ క్వాలిటీ, డేటా సేవర్ అనే మూడు ఆప్షన్లు ఉంటాయి. ఆటో ఆప్షన్‌ కంప్రెషన్ అల్గారిథమ్‌తో కొన్ని రకాల వీడియోలను సైజ్‌ను తక్కువ చేసి పంపేందుకు ఉపయోగపడుతుంది. బెస్ట్ క్వాలిటీ ద్వారా హై-రిజల్యూషన్‌ వీడియోలను పంపొచ్చు. హై-బ్యాండ్‌విడ్త్‌ నెట్‌వర్క్‌ అందుబాటులో లేనప్పుడు డేటా సేవర్ ఆప్షన్‌ను ఉపయోగించి వీడియోలను షేర్ చెయ్యొచ్చు.

అయితే బెస్ట్‌ క్వాలిటీ ఆప్షన్ ద్వారా ఎంత వేగంగా వీడియో పంపాలనేది మీరు ఉపయోగిస్తున్న డివైజ్‌, నెట్‌వర్క్‌ స్పీడ్ వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ ఫీచర్‌ను భవిష్యత్తులో యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇన్​స్టాలోనూ పెరగనున్న క్వాలిటీ..

టిక్​టాక్​లాగా షార్ట్ వీడియోలను అందించే దిగ్గజ సామాజిక మాధ్యమ సంస్థ ఇన్​స్టాగ్రామ్ మరో​ అదిరే ఫీచర్​ను​ అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే ఐజీటీవీ, రీల్స్, స్టోరీస్ ద్వారా వినోదాన్ని పంచుతున్న ఈ సంస్థ.. వీడియో క్వాలిటీని పెంచనున్నట్లు ప్రకటించింది. రాబోయే రెండు నెలల్లో దీనిని పరీక్షించనున్నట్లు తెలిపింది.

"ఇన్​స్టా అనేది కేవలం ఫోటో-షేరింగ్ యాప్​గా కాకుండా.. పూర్తిస్థాయి వినోదం పంచే మాధ్యమంగా ఉండాలని కోరుకుంటున్నా."

-ఆడమ్ మొస్సేరి, ఇన్​స్టా అధినేత

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.