దేశంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో వివిధ కంపెనీలు తమ వంతు సాయం చేసేందుకు ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా దేశీయ ఈ కామర్స్ సంస్థ 'స్నాప్డీల్' తమ ప్లాట్ ఫామ్లో 'సంజీవని' అనే కొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది.
ఏమిటీ సంజీవని?
ప్లాస్మా అవసరమైన కరోనా పేషెంట్లు, ప్లాస్మా దాతలను అనుసంధానం చేసేందుకు 'సంజీవని' టూల్ ఉపయోగపడుతుందని స్నాప్డీల్ తెలిపింది. దేశవ్యాప్తంగా చిన్న చిన్న టౌన్లు, పట్టణాలన్నింటిలో ఈ సదుపాయం వినియోగించుకునే వీలుందని పేర్కొంది. వెబ్సైట్, మొబైల్ యాప్ రెండింటి ద్వారా ఈ ఫీచర్ను సులభంగా వినియోగించుకోవచ్చని వివరించింది.
ఫేస్బుక్, గూగుల్ వంటి దిగ్గజాలు సహా హెల్తీఫైమీ, ట్రూకాలర్, ఎస్ రైడ్, ట్రూలీ మ్యాడ్లీ వంటి యాప్‌లు కూడా ఇటీవల కొవిడ్ సంబంధిత సేవలు ప్రారంభించాయి.
ఇదీ చదవండి:ఆపత్కాలంలో ఉపయోగపడే యాప్‌లు!