ETV Bharat / business

ఈ టిప్స్​తో తక్కువ బడ్జెట్​లోనే అందమైన ఇంటీరియర్​! - ఇంటీరియర్ ఫ్లోరింగ్​లో ఖర్చు తగ్గించే టిప్స్​

ఇంటి నిర్మాణంలో ఇంటీరియర్​ చాలా కీలకమైంది. ఇంట్లో ఉండే వారికి ప్రధాన ఆకర్షణ ఇదే. కానీ.. ఖర్చుతో కూడుకుని ఉంటుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ ఖర్చు భారీగా తగ్గించుకోవచ్చు. అవేంటో చూద్దాం.

best Interior with Low cast
తక్కువ ఖర్చులో బెస్ట్ ఇంటీరియర్​
author img

By

Published : Aug 11, 2021, 10:20 AM IST

భారీగా డబ్బు వెచ్చించి ఇల్లు కొనుక్కున్నప్పటికీ.. మంచి ఇంటీరియర్​ లేకుంటే సొంతింటి ఆహ్లాదాన్ని ఆస్వాదించలేరు. ఇంటీరియర్​ను అందంగా తీర్చిదిద్దుకోవడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే అభిరుచులకు తగ్గట్లు.. తక్కువ ఖర్చులో ఇంటీరియర్​ కావాలనుకుంటారు చాలా మంది. కొన్ని టిప్స్ పాటిస్తే ఇది సాధ్యమేనంటున్నారు నిపుణులు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఫ్లోరింగ్

ఇంటీరియర్ డిజైన్​కు సంబంధించినంత వరకు ఫ్లోరింగ్ కీలకమైంది. మార్కెట్‌లో వివిధ రకాల ఫ్లోరింగ్ డిజైన్‌లు అందుబాటులో ఉన్నాయి. సరైన ప్రణాళికతో బడ్జెట్ ధరలో మంచి ఫ్లోరింగ్​ను నిర్మించుకోవచ్చు. అందుబాటు ధరలో ఆకర్షణీయంగా ఉండే ఫ్లోరింగ్ కావాలంటే టైల్స్​ను ఉపయోగించుకోవచ్చు.

Flooring with tiles
టైల్స్​తో మంచి ఫ్లోరింగ్​

టైల్స్.. పలు ఆకారాలు, పరిమాణాలు, డిజైన్లలో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా టైల్స్.. పాలరాయి, చెక్క ఫ్లోరింగ్ కంటే తక్కువ ధరలో ఉంటాయి. ఫ్లోరింగ్ టైల్స్ ద్వారా డబ్బులు ఆదా చేసుకోవచ్చు. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో కంపెనీల సేల్స్ నిర్వహిస్తాయి. ఇందులో డిస్కౌంట్ ధరలకే రకాల ఫ్లోరింగ్ సామగ్రి కొనుగోలు చేసుకోవచ్చు.

పెయింట్స్

గోడలకు పెయింట్స్ కూడా ఇంటీరియర్​లో ప్రధాన ఆకర్షణ. పెయింట్ లేకపోతే ఇంటికి కళ ఉండదు. బడ్జెట్ ధరలో అందుబాటులో ఉన్న పెయింట్స్​ను వాడటం వల్ల ఇంటీరియర్ ఖర్చు తగ్గించుకోవచ్చు. పెయింటింగ్​కు ముందు గోడలపై ప్రైమర్​ను ఉపయోగించటం వల్ల పెయింటింగ్​పై కొంత మొత్తం ఆదా చేసుకోవచ్చు. ప్రైమర్ వల్ల పెయింట్ వినియోగం తగ్గుతుంది. గోడలూ ఆకర్షణీయంగా మారతాయి.

Painting walls in Budget
తక్కువ ఖర్చుతో గోడలకు పెయింటింగ్​

మంచి నాణ్యమైన పెయింట్లను ఎంచుకోవటం వల్ల ఖర్చు తగ్గించుకోవచ్చు. నాణ్యమైన పెయింట్లు ఉపయోగించినట్లయితే తక్కువ కోటింగ్​లు సరిపోతాయి. అంతేకాకుండా ఎక్కువకాలం పెయింట్ మన్నికగా ఉంటుంది. తక్కువ రంగులు ఉపయోగించటం వల్ల మిగులు తగ్గిపోతుంది. ఎక్కువ పెయింట్స్ ఉపయోగించినట్లయితే.. ఒక్కో దానిలో కొంచెం కొంచెం మిగిలినా కూడా మొత్తంగా మిగులు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఖర్చు పెరిగిపోతుంది. అందుకే పెయింట్ ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. పెయింట్ ఎంత అవసరం పడుతుంది? అన్న విషయంలో ఆన్​లైన్​లో పలు వెబ్​సైట్స్​ను ఉపయోగించి అంచనా వేసుకోవచ్చు.

ఫర్నిచర్

కొత్త ఫర్నిచర్‌ను కొనుగోలు చేయటానికి బదులుగా పాత ఫర్నిచర్‌ను రీమోడలింగ్ చేయించుకోవటం ద్వారా ఖర్చు తగ్గించుకోవచ్చు. పాత ఫర్నిచర్​కు తిరిగి పెయింట్ వేసుకోవటం, రీమోడలింగ్ చేయించటం వల్ల కొత్త వాటి అనుభూతినే పొందవచ్చు. సోఫా సెట్​ను మార్చటం బదులు దాని కవర్ ను మార్చుకోవచ్చు. రిఫ్రిజిరేటర్, టీవీ వంటి వాటిని శుభ్రం చేసుకోవచ్చు. కచ్చితంగా అవసరమైతే తప్ప కొత్త వాటిని కొనకపోవడం ఉత్తమం అంటున్నారు ఎక్స్​పర్ట్స్​.

New Look to Old Furniture
పాత ఫర్నీచర్​కు కొత్త హంగులు

లైటింగ్

లైటింగ్​కు సంబంధించి మార్కెట్లో చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో బడ్జెట్ ధరల్లో కొనుగోళ్లు జరపటం చాలా కష్టతరమనే చెప్పొచ్చు. విలాసానికి సంబంధించిన లైట్లను ఉపయోగించకపోతే ఖర్చు భారీగా తగ్గించుకోవచ్చు. ఇల్లు ప్రకాశవంతంగా కనిపించేందుకు ఎల్ఈడీ లైట్లను ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల మొదట్లో ఖర్చు ఎక్కువైనా.. దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తం ఆదా అవుతుంది. ఎల్​ఈడీలో కలర్ లైట్లను కూడా ఉపయోగించుకోవచ్చు.

ఇంటి అలంకరణ

ఇంటి అలంకరణకు అందుబాటు ధరలో లభించే వస్తువులు, పరికరాలను ఉపయోగించొచ్చు. మొక్కలను అలంకరణలో వాడొచ్చు. ఇవి బడ్జెట్ ధరలోనే లభిస్తాయి. వీటన్నింటితో పాటు.. సొంతంగా డిజైన్​ చేసుకున్న అలంకరణ వస్తువులతో ఖర్చు తగ్గించుకోవచ్చు.

Decoration with low cast
తక్కువ ఖర్చులో మంచి అలంకరణ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.