ప్రస్తుతానికి ఖరీదైన, పెద్ద కార్లలోనే ఎయిర్‌బ్యాగ్స్ సౌకర్యం ఉంది. ఇకపై మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేసే చిన్న కార్లలోనూ ఎయిర్‌బ్యాగ్స్ ఉండే విధంగా వాహనాలను తయారు చేయాలని చేయాలని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ నితిన్ గడ్కరీ(Nitin Gadkari News) ఆటోమొబైల్ సంస్థలకు సూచించారు. బడ్జెట్ కార్లలో తగినన్ని ఎయిర్‌బ్యాగ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రయాణికుల రక్షణతో పాటు ప్రమాదాలలో సంభవించే మరణాలను నివారించవచ్చని గడ్కరీ నొక్కి చెప్పారు. వాహనాలపై అధిక పన్నులు, కఠినమైన భద్రత, ఉద్గార నిబంధనలతో ఉత్పత్తి వ్యయం పెరుగుతుందని ఆటోమొబైల్ సంస్థలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్న తురణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ధనవంతలు కొంటున్న పెద్ద కార్లలో ఎనిమిది ఎయిర్‌బ్యాగ్స్(car airbag manufacturers in india) ఏర్పాటు చేసి, చిన్న కార్లలో ఎందుకు ఏర్పాటు చేయడం లేదని గడ్కరీ ప్రశ్నించారు.
"దిగువ, మధ్యతరగతి ప్రజలు తక్కువ బడ్జెట్ కార్లను అధికంగా కొనుగోలు చేస్తుంటారు. అయితే ఆ కార్లలో ఎయిర్‌బ్యాగ్స్ ఉండవు. ఒకవేళ ప్రమాదానికి గురైతే.. ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి అన్నిరకాల వాహనాల్లో కనీసం ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ఉండేలా చూడాలి," అని గడ్కరీ సూచించారు. అలాగే చిన్న కార్లలో అదనపు ఎయిర్‌బ్యాగ్‌లు ఏర్పాటు చేస్తే కనీసం ధర రూ.3,000-4,000 వరకు పెరుగుతుందన్న గడ్కరీ.. "మన దేశంలో పేదలకు రక్షణ కల్పించాలి(రోడ్డు ప్రమాదాలు జరిగితే)" అని అన్నారు.
'ఎన్హెచ్ఏఐ.. బంగారు గని'
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే(Delhi Mumbai expressway)ప్రారంభమైతే ప్రతినెల రూ.1,000 నుంచి 1500 కోట్ల టోల్ ఆదాయాన్ని కేంద్రం పొందుతుందని గడ్కరీ పేర్కొన్నారు. ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న జాతీయ రహదారి ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) ఆదాయాన్ని సంపాదించే 'బంగారు గని'గా అభివర్ణించారు. గత ఏడేళ్లుగా దేశంలో రోడ్లు విస్తరణనే లక్ష్యంగా ఎన్హెచ్ఏఐ పని చేస్తోంది. ఇవి పూర్తయితే.. వాటి ద్వారా వచ్చే వార్షిక ఆదాయం రూ.1.40 లక్షల కోట్లకు పెరుగుతుందన్నారు.
ప్రస్తుతం వీటి ద్వారా సంవత్సరానికి రూ.40,000 కోట్లు ఆదాయం లభిస్తోంది.
అఫ్గాన్ పెట్టుబడులపై మోదీ నిర్ణయం!
అఫ్గానిస్థాన్‌లో మౌలిక సదుపాయల పెట్టుబడులు కొనసాగించే విషయంలో ప్రధాని మోదీ నిర్ణయం తీసుకుంటారని నితిన్ గడ్కరీ(Nitin Gadkari latest news) వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత విదేశాంగ మంత్రి జై శంకర్, ప్రధాని మోదీ చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అఫ్గాన్‌లో భారత్ అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టిందని గుర్తు చేసిన గడ్కరీ.. సంక్షేమ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో భారత్.. మూడు బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టిందని వెల్లడించారు. అఫ్గాన్‌లో తాలిబన్ల(Afghan Taliban) ప్రభుత్వం ఏర్పడటం వల్ల భారత పెట్టుబడులపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో గడ్కరీ స్పందించారు.
ఇదీ చూడండి: పంజాబ్ 'సీఎం' ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ తర్జనభర్జన!