ఆన్లైన్ షాపింగ్(Online shopping) అనేది ఇప్పుడు సర్వ సాధారణం అయిపోయింది. ఎలక్ట్రానిక్స్ మొదలుకొని నిత్యావసర సరుకుల వరకు ఈ-కామర్స్(e-commerce) మీదనే చాలా మంది ఆధారపడుతున్నారు. కరోనా వల్ల కూడా ఈ-కామర్స్ సైట్ల వినియోగం పెరిగింది.
ఈ-కామర్స్ సైట్లలో షాపింగ్ సందర్భంలోనూ కొంత మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు. దీనికోసం కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. వాటి గురించి తెలుసుకుందాం..
పోల్చి చూసుకోవటం
ప్రస్తుతం చాలా ఈ-కామర్స్ సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక దానిలోని ధరతో ఇంకో దానిలోని ధరకు తేడా ఉండవచ్చు. వీటన్నింటిని పోల్చి చూసుకోవటం ద్వారా తక్కువ ధరకు పొందవచ్చు. ఇందుకోసం ఒక్కో సైట్‌కు వెళ్లి ధరలను చూడాల్సిన అవసరం కూడా లేదు.
ఎందుకంటే.. ధరలను పోల్చి చూసుకునేందుకు కొన్ని వెబ్సైట్లు కూడా ఉన్నాయి. వాటి ద్వారా ఒక వస్తువు వివిధ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఉన్న ధరలను ఒక్క క్లిక్‌తో తెలుసుకోవచ్చు. మై స్మార్ట్ ప్రైస్, ఫోన్ కర్రీ లాంటివి వీటికి ఉత్తమ ఉదాహరణలు.
కూపన్స్
కొన్ని షాపింగ్ సైట్లు కూపన్లను తీసుకుంటాయి. కూపన్స్ ద్వారా డిస్కౌంట్ లభిస్తుంది. కూపన్ దునియా, కూపన్ రాజా తదితర సైట్లు ఈ-కామర్స్ పోర్టళ్ల కూపన్లను అందిస్తుంటాయి. బ్రౌజర్ యాడ్ ఆన్స్, ఎక్స్టెన్షన్ల ద్వారా కూడా సులభంగా కూపన్లను పొందవచ్చు. ఈ యాడ్ ఆన్లు... ఈ-కామర్స్ సైట్లో ప్రాడక్ట్ పేజీలోకి వెళ్లగానే దానికి సంబంధించిన కూపన్ ఉంటే మనకు తెలియజేస్తుంది
క్యాష్‌బ్యాక్ సైట్లు
కూపన్లు డిస్కౌంట్లు ఇస్తే క్యాష్‌బ్యాక్ సైట్లు కొంత మొత్తాన్ని తిరిగి మనకే అందిస్తాయి. ఈ క్యాష్‌బ్యాక్ వెబ్సైట్లో పలు రకాల ఈ-కామర్స్ సైట్లకు సంబంధించిన క్యాష్‌బ్యాక్ వివరాలు ఉంటాయి. ఈ సైట్ల ద్వారా 3 శాతం వరకు పొదుపు చేసుకోవచ్చు.
ఉదాహరణ: క్యాష్‌కరో
ధరల అలర్ట్స్
బై హట్కే లాంటి ఎక్స్టెన్షన్ ద్వారా కూపన్లు, ఆఫర్లు తెలుసుకోవటమే కాకుండా ధర తగ్గినప్పుడు మెయిల్ ద్వారా అలర్ట్స్‌ను కూడా పంపిస్తుంది. ధర తగ్గే అవకాశాలను కూడా తెలియజేస్తుంది. వేరే సైట్లలో తక్కువ ధర ఉంటే దానికి సంబంధించిన వివరాలను కూడా ఈ ఎక్స్ టెన్షన్ తెలియజేస్తుంది. దీనివల్ల తక్కువ ధర ఇస్తున్న సైట్ల నుంచి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయొచ్చు.
పండుగల సమయంలో భారీ ఆఫర్లు..
పండగల సమయంలో ఈ-కామర్స్ సైట్ల ప్రత్యేక సేల్ నిర్వహిస్తుంటాయి. బిగ్ బిలియన్ డేస్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లాంటివి ఇందుకు ఉదాహరణ. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో కొనుగోలు చేయటం ద్వారా చాలా తక్కువకే మనకు కావాల్సినవి పొందవచ్చు.
క్రెడిట్ కార్డులతో మరింత డిస్కౌంట్..
ఈ-కామర్స్ సంస్థలు సాధారణంగా క్రెడిట్ కార్డులపై ప్రత్యేక ఆఫర్లను అందిస్తుంటాయి. ఇవి దాదాపు అన్ని రోజుల్లో అందుబాటులో ఉంటాయి కాబట్టి క్రెడిట్ కార్డులను ఉపయోగించటం ద్వారా ఎక్కువ డిస్కౌంట్ పొందవచ్చు.
సామాజిక మాధ్యమాలు ద్వారా నోటిఫికేషన్
కొన్ని సామాజిక మాధ్యమ ఖాతాలు మంచి డీల్స్, ఆఫర్స్ గురించి తెలుపుతుంటాయి. వీటిని అనుసరించటం వల్ల వాటి గురించి తెలుసుకోవచ్చు. వీటి వల్ల తక్కువ ధరకు ఉత్పత్తులను పొంది డబ్బులు ఆదా చేసుకోవచ్చు.
ప్రైమ్ వంటి సదుపాయాలతో అదనపు ప్రయోజనాలు..
అమెజాన్ ప్రైమ్ ద్వారా సాధారణ వినియోగదారుల కంటే ఎక్కువ ఆఫర్ పొందవచ్చు. అంతేకాకుండా ఫ్రీ డెలివరీ పొందవచ్చు. కేవలం షాపింగ్‌కే కాకుండా వీడియో స్ట్రీమింగ్ తదితర సదుపాయాలను వినియోగించుకోవచ్చు.
సబ్‌స్క్రైబ్ అండ్ సేవ్ సదుపాయం
నెలవారీగా నిత్యావసరాల కొనుగోలుకు ఈ సదుపాయం ఉపయోగపడుతుంది. అమెజాన్‌లో ఈ సదుపాయం ఉంది. ఈ ఫీచర్ ఉపయోగించుకోవటం ద్వారా 5 నుంచి 10 శాతం ఆదా చేసుకోవచ్చు.
వేరు ఖాతాలు ఉపయోగించటం
ఈ టెక్నిక్‌ను చాలా మంది ఉపయోగించే ఉంటారు. వేరు వేరు ఖాతాలు ఉపయోగించటం ద్వారా ఒకే ఆఫర్‌ను ఒకటి కంటే ఎక్కువ సార్లు వాడుకోవచ్చు. ఉదాహరణకు ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఉంటే.. ఇరువురి ఖాతాలను ఉపయోగించి కొనుగోలు చేస్తే ఆదాను పెంచుకోవచ్చు.
బ్రౌజర్‌ను ప్రైవేట్ మోడ్‌లో ఉపయోగించటం
బ్రౌజన్ సెర్చ్ హిస్టరీ ఆధారంగా ధర మారే అవకాశం ఉంటుంది. అయితే అన్ని సార్లు ఇది జరగకపోవచ్చు. కాబట్టి బ్రౌజర్‌ను ప్రైవేట్ మోడ్లు ఉపయోగించి ఒక సారి ధరను చెక్ చేసుకోవటం ఉత్తమం.
ఇదీ చదవండి: