కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్లో కీలక బాధ్యతలను ఆ కంపెనీ వ్యవస్థాపకుడు.. దివంగత వీజీ సిద్దార్థ భార్య మాళవిక హెగ్డే చేపట్టారు. ఆమె ముఖ్య కార్యనిర్వాహక అధికారి(సీఈఓ)గా నియమితులయ్యారని ఆ కంపెనీ సోమవారం ప్రకటించింది.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ ఎమ్ కృష్ణ కుమార్తె అయిన మాళవిక.. కంపెనీకి ఉన్న కోట్లాది రూపాయల రుణభారాన్ని తగ్గించడానికి తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. మాళవికతో పాటుగా వసుంధరా దేవీ, గిరి దేవనూర్, మోహన్ రాఘవేంద్రను అదనపు డైరెక్టర్ హోదాల్లో కంపెనీ బోర్డు నియమించింది. 2020, డిసెంబర్ 31 నుంచి 2025 డిసెంబర్ 30 వరకు వీరు ఆ పదవుల్లో ఉండనున్నారు.
గతేడాది ఆగస్టులో వీజీ సిద్ధార్థ హఠాన్మరణం చెందారు. ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానించారు. అప్పటి నుంచి ఆ కంపెనీ అప్పులు మరింత అధికమయ్యాయి. ఈ క్రమంలో ఆస్తుల అమ్మకం ద్వారా తమ అప్పులను తీర్చడానికి ప్రయత్నిస్తోంది ఆ కంపెనీ.
ఇవీ చదవండి: