రష్యాకు చెందిన స్పుత్నిక్- వి టీకాను ఉత్పత్తి చేయడంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ మరో ప్రముఖ ఔషధ ఉత్పత్తి సంస్థ అయిన శిల్పా బయోలాజికల్స్ ప్రైవేట్ లిమిటెడ్(ఎస్బీపీఎల్)తో కలిసి పనిచేయనుంది. ఈ మేరకు ఇరు కంపెనీలు ఒప్పందం చేసుకున్నట్లు ఎస్బీపీఎల్ తెలిపింది.
"స్పుత్నిక్- వి టీకాను ఉత్పత్తి-సరఫరా చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌తో శిల్పా బయెలాజికల్స్ ప్రైవేట్ లిమిటెట్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం మూడేళ్లపాటు కొనసాగనుంది. కర్ణాటక, ధార్వాడ్‌లోని ఉండే ఎస్బీపీఎల్కు చెందిన రీసెర్చ్ కేంద్రం నుంచి వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనున్నాం."
-శిల్పా మెడికేర్
వచ్చే ఏడాది కాలంలో ఐదుకోట్ల డోసులను ఉత్పత్తి చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని సంస్థ ముందుకు వెళ్తున్నట్లు తెలిపింది. ఇందుకుగాను స్పుత్నిక్ వి టీకా అభివృద్ధి చేయడానికి సంబంధించిన టెక్నాలజీని డాక్టర్ రెడ్డీస్, తాము పంచుకుంటామని ఎస్బీపీఎల్ స్పష్టం చేసింది.
ఈ ఒప్పందం ప్రకారం ఎస్బీపీఎల్ టీకా ఉత్పత్తిని చూసుకుంటే.. వ్యాక్సిన్ పంపిణీ, మార్కెటింగ్ బాధ్యతలు రెడ్డీస్ తీసుకుంటుందని వివరించింది.
ఇవీ చూడండి:
భారత్‌లో తొలి సింగిల్ డోస్ టీకా అదేనా?