ETV Bharat / business

పెట్రో సెగ.. తొమ్మిదో రోజూ కొత్త రికార్డు - పెట్రోల్ డీజిల్​ ధరలు పెంపు

సామాన్యులకు పెట్రోల్​ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. వరుసగా తొమ్మిదో రోజూ లీటర్​ పెట్రోల్ ధర (దిల్లీలో) 25 పైసలు పెరిగింది. బుధవారం హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్ ధర ఏకంగా రూ.93 దాటింది.

petrol price hike
పెరిగిన పెట్రోల్ ధరలు
author img

By

Published : Feb 17, 2021, 7:04 AM IST

Updated : Feb 17, 2021, 8:36 AM IST

దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా తొమ్మిదో రోజూ పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో బుధవారం పెట్రోల్​పై లీటర్​కు 25 పైసలు పెరిగి.. రూ.89.54 వద్దకు చేరింది. లీటర్​ డీజిల్​ ధర కూడా 25 పైసలు పెరిగింది. లీటర్​ డీజిల్ ధర ప్రస్తుతం రూ.79.99 వద్ద ఉంది.

దేశవ్యాప్తంగా ఇతర ప్రధాన నగరాల్లోనూ పెట్రోల్​ ధర లీటర్​కు 22-26 పైసల మధ్య పెరిగింది. డీజిల్ ధర లీటర్​పై 24 పైసల నుంచి 27 పైసల వరకు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

కొత్త సంవత్సరంలో ఇప్పటి వరకు 11 సార్లు పెట్రోల్ ధరలు పెరిగాయి. దీనితో లీటర్​ పెట్రోల్​పై సామాన్యులకు రూ.6 భారం పడింది.

ప్రధన నగరాల్లో ఇంధన ధరలు (లీటర్​కు)

నగరంపెట్రోల్డీజిల్
హైదరాబాద్రూ.93.08 రూ.87.18
బెంగళూరురూ.92.51రూ.84.74
ముంబయిరూ.95.98 రూ.86.96
చెన్నైరూ.91.66రూ.84.99
కోల్​కతారూ.90.76రూ.83.52

ఇదీ చదవండి:మార్చి 4 పీఎఫ్​పై వడ్డీ రేటు ప్రకటన!

Last Updated : Feb 17, 2021, 8:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.