ETV Bharat / business

రుణాల రికవరీపై సుప్రీం కీలక తీర్పు

దివాలా స్మృతి(ఐబీసీ)కి సంబంధించి సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పునిచ్చింది. కార్పొరేట్‌ బకాయిదార్లకు వ్యక్తిగత హామీదార్లుగా ఉన్న వారిపై ఐబీసీ కింద రుణాల రికవరీ విషయంలో చర్యలు తీసుకోడానికి బ్యాంకులను అనుమతిస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌(2019)ను న్యాయస్థానం సమర్థించింది.

SC upholds lenders right
సుప్రీం ధర్మాసనం
author img

By

Published : May 21, 2021, 5:37 PM IST

Updated : May 22, 2021, 7:05 AM IST

కార్పొరేట్‌ బకాయిదార్లకు వ్యక్తిగత హామీదార్లుగా ఉన్న వారిపై దివాలా చర్యల విషయంలో అనుమానాలను పటాపంచలు చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. దివాలా స్మృతి(ఐబీసీ) కింద రుణాల రికవరీ విషయంలో అటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోడానికి బ్యాంకులను అనుమతిస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌(2019)ను సుప్రీంకోర్టు సమర్థించింది. ఐబీసీ కింద ఖాయిలా పడ్డ కంపెనీల పునరుజ్జీవానికి పరిష్కార ప్రణాళికకు అనుమతి ఇచ్చినంత మాత్రాన, వ్యక్తిగత హామీదార్లు బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు రద్దు కావని, అవి విడిగా కాంట్రాక్టులకు లోబడి ఉండడమే అందుకు కారణమని న్యాయమూర్తులు జస్టిస్‌ ఎల్‌. నాగేశ్వరరావు, జస్టిస్‌ ఎస్‌. రవీంద్ర భట్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

ఒక స్వతంత్ర కాంట్రాక్టు ఆధారంగా ఏర్పడ్డ ఆ హామీ లిక్విడేషన్‌ లేదా దివాలా ప్రక్రియ లేదా ఆపరేషన్‌ ఆఫ్‌ లా లేదా ఇన్‌వాలంటరీ ప్రక్రియ కారణంగా విమోచనం చెందజాలదని 82 పేజీల తీర్పులో ధర్మాసనం పేర్కొంది. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ 'చట్టబద్ధం, చెల్లుబాటు అయ్యేది' అని ధర్మాసనం తెలిపింది. రుణాలు పొందడం కోసం బ్యాంకులు, ఆర్థిక కంపెనీలకు వ్యక్తిగత హామీలు ఇచ్చిన వివిధ కంపెనీలు, వ్యక్తులు దాఖలు చేసిన 75కు పైగా పిటిషన్ల నేపథ్యంలో ఈ తీర్పు వెలువడింది.

ఈ తీర్పుతో ఏం జరుగుతుంది?

తాజా తీర్పు కారణంగా రుణ పరిష్కారం కోసం జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)కి వెళ్లిన భారత కంపెనీలకు చెందిన పలువురు ప్రమోటర్లపై వ్యక్తిగత దివాలా దాఖలు చేయడానికి బ్యాంకులకు అనుమతులు వచ్చినట్లయింది. ఎగవేతదార్ల వ్యక్తిగత హామీలపై చర్యలకు దిగడానికి ప్రభుత్వం నవంబరు 2019లో ఐబీసీని సవరించడం దీనికి నేపథ్యం. గతేడాది రిలయన్స్‌ గ్రూప్‌ అనిల్‌ అంబానీ, దేవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్ప్‌నకు చెందిన కపిల్‌ వాద్వాన్‌, భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌కు చెందిన సంజయ్‌ సింఘాల్‌ తదితర కంపెనీలకు చెందిన ప్రమోటర్లపై దివాలా కేసులు ఫైల్‌ అయిన సంగతి తెలిసిందే. తాజా పరిణామాలతో వీరిపై చర్యలు కొనసాగనున్నాయి.

ఇదీ చవవండి:జూన్ 1న మార్కెట్లోకి కోటి 'కొవిసెల్ఫ్​' టెస్ట్​ కిట్​లు!

Last Updated : May 22, 2021, 7:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.