ETV Bharat / business

ప్రయాణికుల వాహనాల విక్రయాల్లో 26 శాతం వృద్ధి

author img

By

Published : Oct 17, 2020, 11:55 AM IST

ప్యాసింజర్ వాహనాల విక్రయాలు సెప్టెంబర్​లో భారీగా 26.45 శాతం పెరిగి.. 2,72,027గా నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2లోనూ ప్రయాణికుల వాహన అమ్మకాలు 17 శాతం పెరిగినట్లు సియామ్ గణాంకాల్లో తేలింది. వాహన విక్రయాలపై సియామ్ విడుదల చేసిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

passenger vehicle sales rise in September
సెప్టెంబర్​లో భారీగా పెరిగిన వాహన విక్రయాలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రయాణికుల వాహన విక్రయాలు దేశీయంగా 2019-20 ఇదే సమయంతో పోలిస్తే 17 శాతం పెరిగాయి. పండుగ సీజన్​, వినియోగదారుల్లో కొనుగోలు సెంటిమెంట్​ మెరుగవ్వడం వంటివి ఇందుకు కారణంగా తెలిపింది వాహన తయారీదారుల సంఘం (సియామ్).

క్యూ2 వాహన విక్రయాలు ఇలా..

  • 2020-21 రెండో త్రైమాసికంలో 7,26,232 ప్రయాణికుల వాహనాలు విక్రయమయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఈ సంఖ్య 6,20,620 యూనిట్లుగా ఉంది.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో 46,90,565 ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో 46,82,571 యూనిట్లే విక్రయమయ్యాయి.
  • వాణిజ్య వాహనాల విక్రయాలు మాత్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 20.13 శాతం క్షీణించి.. 1,33,524 యూనిట్లకు పరిమితమయ్యాయి. 2019-20 క్యూ2లో 1,67,173 యూనిట్లు అమ్ముడవ్వడం గమనార్హం.
  • త్రిచక్ర వాహనాల విక్రయాలు గత ఆర్థిక సంవత్సరం క్యూ2తో పోలిస్తే.. 2020-21 క్యూ2లో భారీగా 74.63 క్షీణతతో..1,80,899 నుంచి 45,902 యూనిట్లకు పడిపోయాయి.
  • అన్ని విభాగాల్లో కలిపి వాహన విక్రయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో.. 2019-20 ఇదే సమయంతో పోలిస్తే 56,51,459 యూనిట్ల నుంచి స్వల్పంగా 55,96,223కు తగ్గాయి.

పండుగ సీజన్​ నేపథ్యంలో వాహన విక్రయాలు ఇంకా భారీగా పెరుగుతాయని ఆశాభావంగా ఉన్నట్లు సియామ్ అధ్యక్షుడు కెనిచి అయుకవా తెలిపారు.

సెప్టెంబర్​లో వాహన విక్రయాలు..

సెప్టెంబర్​లో ప్యాసింజర్ వాహన విక్రయాలు 26.45 శాతం పెరిగి..2,72,027గా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో 2,15,124 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇదే సమయానికి ద్విచక్ర వాహనాల అమ్మకాలు 11.68 శాతం వృద్ధితో 16,56,658 యూనిట్ల నుంచి 18,49,546 యూనిట్లకు పెరిగాయని సియామ్ తెలిపింది.

ఇదీ చూడండి:పండుగ సీజన్​లో కార్లపై అదిరే ఆఫర్లు ఇవే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.