ETV Bharat / business

వారాంతంలో లాభాల జోరు- 11,600పైకి నిఫ్టీ - సెన్సెక్స్

వారంలో చివరి సెషన్​ను భారీ లాభాలతో ముగించాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 354 పాయింట్లు బలపడింది. నిఫ్టీ 88 పాయింట్ల లాభంతో 11,600 మార్క్​ దాటింది. కరెన్సీ మార్కెట్లో రూపాయి శుక్రవారం భారీగా 43 పైసలు పెరిగింది.

share market news
నేటి స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Aug 28, 2020, 3:42 PM IST

Updated : Aug 28, 2020, 6:20 PM IST

స్టాక్ మార్కెట్లు వారాంతంలో భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 354 పాయింట్లు పెరిగి 39,467 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 88 పాయింట్ల లాభంతో 11,648 వద్దకు చేరింది. ఒడుదొడుకులు ఎదురైనా సూచీలు ఈ వారమంతా లాభాలనే నమోదు చేయడం గమనార్హం.

అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలకు తోడు.. ఆర్థిక షేర్లు రాణించడం శుక్రవారం లాభాలకు ప్రధాన కారణం.

కరోనా సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు రెండో దశ ప్యాకేజీ సహా.. పలు సంస్కరణలు తీసుకువచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందన్న వార్తలు మదుపరుల సెంటిమెంట్​ను బలపరిచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

ఇంట్రాడే సాగిందిలా

సెన్సెక్స్ 39,580 పాయింట్ల అత్యధిక స్థాయి, 39,235 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 11,686 పాయింట్ల గరిష్ఠ స్థాయి;11,589 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

మార్కెట్లో నేడు

లాభనష్టాల్లోనివి ఇవే..

ఇండస్​ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్​బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, సన్​ఫార్మా, కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభాలను నమోదు చేశాయి.

పవర్​గ్రిడ్, ఇన్ఫోసిస్, హెచ్​యూఎల్, మారుతీ, ఏషియన్ పెయింట్స్, ఎం&ఎం షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఆసియా మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు అయిన జపాన్​ సూచీ-నిక్కీ మినహా.. షాంఘై, కోస్పీ, హాంగ్​సెంగ్ సూచీలు లాభాలతో ముగిశాయి.

రూపాయి, ముడి చమురు

కరెన్సీ మార్కెట్​లో రూపాయి విలువ శుక్రవారం భారీగా 43 పైసలు బలపడింది. దీనితో డాలర్​తో పోలిస్తే మారకం విలువ 73.39 వద్దకు చేరింది.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.33 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్​లో బ్యారెల్ ముడి చమురు ధర 44.94 డాలర్లకు చేరింది.

ఇదీ చూడండి:టిక్​టాక్​ కోసం మైక్రోసాఫ్ట్​తో వాల్​మార్ట్​ జట్టు!

Last Updated : Aug 28, 2020, 6:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.