కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీ ... దేశీయ మార్కెట్లలో జోష్ నింపింది. ఫలితంగా మార్కెట్లు భారీ లాభాలు సాధించాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 637 పాయింట్లు లాభపడి 32 వేల 008 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 187 పాయింట్లు వృద్ధి చెంది 9 వేల 383 వద్ద స్థిరపడింది.
కరోనా కారణంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న భారత ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు.. ప్రధాని మోదీ రూ.20లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాల్ని ఆర్థిక శాఖ విడతలవారీగా వెల్లడించనుంది.
లాభనష్టాల్లో..
యాక్సిస్ బ్యాంకు, ఎల్ అండ్ టీ, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఎమ్ అండ్ ఎమ్, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకు రాణించాయి.
నెస్లే ఇండియా, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్టెల్ నష్టపోయాయి.
ఇదీ చూడండి: ప్యాకేజీపై సర్వత్రా ఉత్కంఠ- నిధుల కేటాయింపు ఎలా?