ETV Bharat / business

కొనుగోళ్ల మద్దతుతో... భారీ లాభాలు

author img

By

Published : Dec 27, 2019, 4:23 PM IST

Updated : Dec 27, 2019, 5:45 PM IST

దేశీయ స్టాక్​మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. లోహ, వాహన, బ్యాంకింగ్ సహా పలు రంగాలు పుంజుకోవడం కలిసొచ్చింది.

Sensex zooms 411 points
కొనుగోళ్ల మద్దతుతో... భారీ లాభాలు

వరుస నష్టాల నుంచి దేశీయ మార్కెట్లు కోలుకున్నాయి. బ్యాంకింగ్, లోహ, ఫార్మా, వాహనరంగ షేర్ల కొనుగోళ్ల అండతో జనవరి డెరివేటివ్​ సిరీస్​ భారీ లాభాలను మూటగట్టుకుంది.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 411 పాయింట్లు వృద్ధి చెంది 41 వేల 575 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 119 పాయింట్లు లాభపడి 12 వేల 245 వద్ద స్థిరపడింది.

రుణదాతల (బ్యాంకులు) ఆర్థిక పనితీరును, వారి వ్యాపార వృద్ధిని సమీక్షించడానికి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ శనివారం ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో సమావేశం కానున్నారు. ఇందులో నిరర్థక ఆస్తుల రికవరీ, బ్యాంకుల రుణ సామర్థ్యం పెంపుపై దృష్టి సారించే అవకాశం ఉంది. ఈ సానుకూల అంచనాలతో ఇవాళ బ్యాంకింగ్ స్టాక్స్ ర్యాలీ చేశాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

లాభనష్టాల్లో

యాక్సిస్​ బ్యాంకు, కోల్​ ఇండియా, బీపీసీఎల్​, పవర్​గ్రిడ్​ కార్ప్​, ఎస్​బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, భారతీ ఎయిర్​టెల్​ రాణించాయి.

ఎస్​ బ్యాంకు, విప్రో, బ్రిటానియా, కోటక్​ మహీంద్రా, భారతీ ఇన్​ఫ్రాటెల్​, టైటాన్​ కంపెనీ, ఆల్ట్రాటెక్​ సిమెంట్​ నష్టపోయాయి.

ఆసియా మార్కెట్లు

అమెరికా-చైనా మధ్య ఫేజ్ వన్​ వాణిజ్య ఒప్పందం వచ్చే నెలలో ఖరారవుతుందనే అంచనాలతో గ్లోబల్ ఈక్విటీలు రాణించాయి. అయితే హాంగ్​సెంగ్​, కోస్పీ లాభాపడగా, నిక్కీ, షాంఘై కాంపోజిట్​ నష్టాలు చవిచూడడం గమనార్హం.

రూపాయి విలువ

రూపాయి విలువ స్వల్పంగా పెరిగి ఒక డాలరుకు రూ.71.36గా ఉంది.

చమురు ధరలు

అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధర 0.29 శాతం పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 68.12 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి: రివ్యూ 2019: ఏడాదిలో ఇంత డేటా వాడేశామా!

New Delhi, Dec 27 (ANI): Television actor Kushal Punjabi was found hanging at his residence in Mumbai on December 26. The incident took place at his Pali Hill residence. Kushal Punjabi was 37-year-old. Police has found a suicide note at his residence. Accidental Death Report (ADR) has been filed and further investigation is underway in the case.

Last Updated : Dec 27, 2019, 5:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.