బ్యాంకింగ్ షేర్ల దన్నుతో స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. బొంబయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 290 పాయింట్లు బలపడి.. 34,247 వద్దకు చేరింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 69 పాయింట్ల లాభంతో 10,116 వద్ద స్థిరపడింది. ఆరంభంలో కాస్త ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు, బ్యాంకింగ్, హెవీ వెయిట్ షేర్ల ఊతంతో తిరిగి లాభాలను అందుకున్నాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 34,303 పాయింట్ల అత్యధిక స్థాయి, 33,949 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 10,137 పాయింట్ల గరిష్ఠ స్థాయి.., 10,036 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాలను ఆర్జించాయి.
2019-20 చివరి త్రైమసికంలో.. నికర లాభం 26.46 శాతం తగ్గినట్లు హీరో మోటోకార్ప్ మంగళవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో బుధవారం సెషన్లో సంస్థ షేర్లు అత్యధిక నష్టాన్ని నమోదు చేశాయి. బజాజ్ ఆటో, టైటాన్, టాటా స్టీల్, ఓఎన్జీసీ, ఎం&ఎం షేర్లూ నష్టాల్లో ముగిశాయి.
రూపాయి..
కరెన్సీ మార్కెట్లో రూపాయి బుధవారం ఫ్లాట్‌గా ముగిసింది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ రూ.75.59 వద్ద స్థిరపడింది.
ఇదీ చూడండి:వాట్సాప్ ద్వారా డబ్బుల ట్రాన్స్ఫర్ ఎలా?