స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 280 పాయింట్లు మెరుగుపడి 37వేల పాయింట్లకు చేరువలో ఉంది. నిఫ్టీ 80 పాయింట్లు వృద్ధి చెంది 11వేల 126 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఈసీ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఈ ప్రకటన మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. మదుపరులు కొనుగోళ్లపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ జోరు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
బ్యాంకింగ్, లోహము, ఇందన రంగాల షేర్లు ఒక శాతానిగి పైగా లాభాలను ఆర్జించాయి.
ఎన్టీపీసీ, ఇండస్ఇండ్, సిప్లా, టెక్ మహింద్రా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 18 పైసలు మెరుగుపడి 69.88గా ఉంది.