ETV Bharat / business

ప్యాకేజ్​ ఇచ్చిన జోష్​- సెన్సెక్స్​ 1,411 పాయింట్లు ప్లస్ - కరోనా న్యూస్

స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1,411 పాయింట్లు బలపడింది. నిఫ్టీ 324 పాయింట్లు పుంజుకుంది. ఇండస్‌ఇండ్ బ్యాంక్ నేడు అత్యధికంగా 46 శాతానికిపైగా వృద్ధి చెందింది.

STOCK MARKET NEWS
స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలు
author img

By

Published : Mar 26, 2020, 3:47 PM IST

స్టాక్ మార్కెట్లలో వరుసగా మూడో రోజూ లాభాల పరంపర కొనసాగింది. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 1,411 పాయింట్లు వృద్ధి చెందింది. చివరకు 29,947 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 324 పాయింట్ల లాభంతో 8,641 వద్దకు చేరింది.

కారణాలు..

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నేపథ్యంలో రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది కేంద్రం. మరోవైపు అమెరికాలో 2 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీకి అంతా సిద్ధమైనట్లు వస్తున్న వార్తలు లాభాలకు కారణమయ్యాయి.

కరోనా వైరస్‌కు ప్రధాన కేంద్రమైన చైనాలోని హుబె రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో అక్కడ లాక్‌డౌన్ ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఆసియా మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. ఈ అంశాలన్నీ మన మార్కెట్ల లాభాలకు కారణమైనట్లు తెలుస్తోంది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​ 30,100 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 28,566 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.

నిఫ్టీ నేడు 8,750 పాయింట్ల అత్యధిక స్థాయి.. 8,305 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోని షేర్లు..

ఇండస్‌ఇండ్ బ్యాంక్ అత్యధికంగా నేడు 46 శాతానికి పైగా వృద్దిచెందింది. ఎల్‌&టీ, బజాజ్ ఫినాన్స్, భారతీఎయిర్‌టెల్‌, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు భారీగా లాభపడ్డాయి.

మారుతీ, టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా, రిలయన్స్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.

ఇదీ చూడిండి:కేంద్రం 'కరోనా ప్యాకేజీ'తో మీకు కలిగే లాభాలివే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.