ETV Bharat / business

జీడీపీ లెక్కలకు ముందు కుప్పకూలిన మార్కెట్లు​ - నిప్టీ

స్టాక్ మార్కెట్లలో బేర్​ స్వైరవిహారం చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతలతో సెన్సెక్స్​ ఏకంగా 1,680 పాయింట్లు తగ్గింది. నిఫ్టీ 480 పాయింట్లకుపైగా కోల్పోయింది.

Stocks in Huge loses
స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు
author img

By

Published : Feb 26, 2021, 12:38 PM IST

Updated : Feb 26, 2021, 1:43 PM IST

స్టాక్ మార్కెట్లు వారాంతపు సెషన్​లో భారీగా పతనమవుతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ రికార్డు స్థాయిలో దాదాపు 1,680 పాయింట్లు కోల్పోయి 49,360 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ- నిప్టీ 480 పాయింట్లకుపైగా నష్టంతో 14,612 వద్ద కొనసాగుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లు భారీగా పతనమైన నేపథ్యంలో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపైనా కనిపిస్తోంది. శుక్రవారమే కేంద్ర గణాంక కార్యాలయం 2020-21 క్యూ3 జీడీపీ గణాంకాలు విడుదల చేయనున్న నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు బ్యాంకింగ్ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటుంటడం ఈ స్థాయి నష్టాలకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

30 షేర్ల ఇండెక్స్​లో సన్​ఫార్మా మినహా మిగతా షేర్లన్నీ నష్టాల్లో ఉన్నాయి.

ఎం&ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్​ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, బజాజ్ ఫిన్​సర్వ్​ షేర్లు నష్టాల్లో ప్రధానంగా ఉన్నాయి.

ఇదీ చదవండి:క్యూ3లోనే సానుకూల వృద్ధి రేటు? కారణాలివే..

Last Updated : Feb 26, 2021, 1:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.