వరుసగా రెండో సెషన్లో స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 481.56. పాయింట్లు బలపడి, 37,535.66 పాయింట్లకు పెరిగింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి-సూచీ నిఫ్టీ 133.15 పాయింట్ల లాభంతో 11,301.20 వద్ద స్థిరపడింది.
ఇదీ కారణం
దేశీయ మదుపరులు అందించిన కొనుగోళ్ల మద్దతు లాభాలకు ప్రధాన కారణం. వీటికి తోడు అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాలు సహా విదేశీ పెట్టుబడులు లాభాలకు ఊతమిచ్చాయి.
వచ్చే సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై అంచనాలు మదుపరుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. దీంతో ఆర్థిక, శక్తి ఉత్పాదకత, టెలికాం రంగాల్లో అధికంగా కొనుగోళ్లు జరిపారు మదుపరులు.
ఇంట్రాడే సాగిందిలా..
సూచీ | గరిష్ఠం | కనిష్ఠం |
సెన్సెక్స్ | 37,586.63 | 37,230.85 |
నిఫ్టీ | 11,320.40 | 11,227.00 |
లాభనష్టాల్లోనివివే...
నేటి ట్రేడింగ్‌లో భారతీ ఎయిర్టెల్ అత్యధికంగా 5.12 శాతం లాభాన్ని నమోదు చేసింది.
ఇండస్ఇండ్ బ్యాంకు (3.69 శాతం), ఐసీఐసీఐ బ్యాంకు (3.27 శాతం), లార్సెన్ టూబ్రో(3.08శాతం), సన్‌ఫార్మా (2.32 శాతం) లాభాలను ఆర్జించాయి.
బజాజ్ ఫైనాన్స్ 1.30 శాతం నష్టపోయింది. ఇన్ఫోసిస్ (0.67 శాతం), ఎన్టీపీసీ (0.59 శాతం), ఓఎన్జీసీ(0.52 శాతం), కోల్ ఇండియా (0.29 శాతం), యెస్ బ్యాంకు (0.25 శాతం) నష్టాలను మూటగట్టుకున్నాయి.
బలపడిన రూపాయి:
మార్కెట్లలో సానుకూలత కారణంగా ఒక్క రోజే రూపాయి 35 పైసలు పుంజుకుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ప్రస్తుతం రూ.67.23 వద్ద స్థిరపడింది.
ఆసియా మార్కెట్లు సాగాయిలా..
ఆసియాలోని ప్రధాన మార్కెట్లన్నీ నేడు లాభాల్లో ముగిశాయి. హాంకాంగ్ సూచీ హాంగ్ సెంగ్ 1.46 శాతం, షాంఘై సూచీ 1.10 శాతం, కొరియా సూచీ కోస్పి 0.89 శాతం, జపాన్ సూచీ నిక్కీ 1.79శాతం లాభాలను నమోదు చేశాయి.